Begin typing your search above and press return to search.

2026 సంక్రాంతి.. వచ్చేది వీళ్లేనా?

టాలీవుడ్ లో పండుగలన్నింటిలో సంక్రాంతికి ఉండే క్రేజే వేరు. హీరోలు, నిర్మాతలు, దర్శకులు.. అప్పుడే తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఫిక్స్ అయిపోతుంటారు.

By:  Tupaki Desk   |   18 Feb 2025 8:30 PM GMT
2026 సంక్రాంతి.. వచ్చేది వీళ్లేనా?
X

టాలీవుడ్ లో పండుగలన్నింటిలో సంక్రాంతికి ఉండే క్రేజే వేరు. హీరోలు, నిర్మాతలు, దర్శకులు.. అప్పుడే తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఫిక్స్ అయిపోతుంటారు. అందుకు గాను ముందే కర్చీఫులు వేస్తుంటారు. కొన్నిసార్లు వెనక్కి కూడా తప్పుకుంటుంటారు. అలా ఈసారి ముగ్గురు హీరోలు సందడి చేశారు.

గేమ్ ఛేంజర్ తో రామ్ చరణ్, డాకు మహారాజ్ తో బాలకృష్ణ, సంక్రాంతికి వస్తున్నాంతో వెంకటేష్.. సంక్రాంతి బరిలోకి దిగారు. మరి వచ్చే ఏడాది సంక్రాంతి సంగతేంటి? ఎవరెవరు రానున్నారు? ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం నలుగురు హీరోలు.. పొంగల్ రేసులో దిగనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. వారెవరంటే?

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్.. ప్రస్తుతం జ‌న నాయ‌గన్ మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. హెచ్. వినోత్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే తెలిపారు. కానీ ఇప్పుడు 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ యోచిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి ప్రాజెక్టు కూడా పొంగల్ కే రానున్నట్లు తెలుస్తోంది. ఇంకా సెట్స్ పైకి వెళ్లని ఆ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. ఒకవేళ అది కాకపోతే.. రావిపూడితో వెంకటేష్ చేయనున్న సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ అయినా వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి.. అనగనగా ఒక రాజు మూవీతో సంక్రాంతికి రానున్నారని తెలుస్తోంది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైంది. కానీ పలు కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. రీసెంట్ గా గ్లింప్స్ రిలీజ్ అవ్వగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది.

అదే సమయంలో కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ సంక్రాంతి బరిలో దిగనున్నారని టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా అమరన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన.. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దీంతో సంక్రాంతికి ఏదో ఒక మూవీతో థియేటర్లలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫో ప్రకారం దళపతి విజయ్, శివకార్తికేయన్, నవీన్ పోలిశెట్టి, చిరంజీవి లేదా వెంకటేష్ వచ్చే సంక్రాంతికి తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు కనిపిస్తుంది. మరి చూడాలి అప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరెవరు వస్తారో..