Begin typing your search above and press return to search.

సంక్రాంతి ఫైట్.. ఆ ఒక్క రోజే 4 సినిమాలు

సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   30 Dec 2023 4:27 AM GMT
సంక్రాంతి ఫైట్.. ఆ ఒక్క రోజే 4 సినిమాలు
X

సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. మొదటి వారంలో సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. మరో వైపు మహేష్ బాబు కూడా సినిమాని ప్రమోట్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఫ్యామిలీతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ముగించుకొని రాగానే గుంటూరు కారం ప్రమోషన్స్ లో పాల్గొంటాడు.

మహేష్ బాబు మూవీ కావడంతో సినిమాపై మంచి హైప్ ఉంది. ఈ చిత్రానికి పోటీగా ప్రశాంత్ వర్మ సూపర్ హీరో మూవీ హనుమాన్ కూడా అదే రోజు రిలీజ్ అవుతోంది. ఈ సినిమాపైన ఆడియన్స్ ఇంటరెస్టింగ్ గానే ఉన్నారు. మైథాలజీ టచ్ ఉన్న కాన్సెప్ట్ అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో వస్తూ ఉండటంతో దేశ వ్యాప్తంగా హనుమాన్ కి క్రేజ్ ఉంది. రిలీజ్ వాయిదా వేసుకోవాలని రిక్వస్ట్ చేసిన ప్రశాంత్ వర్మ వెనక్కి తగ్గలేదు.

ఈ రెండు చిత్రాలతో పాటు అదే రోజు మరో మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఇవి కోలీవుడ్ నుంచి రాబోతున్న సినిమాలు కావడం గమనార్హం. తెలుగులో కూడా డబ్బింగ్ వెర్షన్స్ తో ఈ చిత్రాలు రిలీజ్ అవ్వనున్నాయి. వీటిలో విజయ్ సేతుపతి మెర్రీ క్రిస్మస్ ఉంది. ఈ చిత్రంలో కత్రినాకైఫ్ విజయ్ సేతుపతికి జోడీగా నటించింది. ధనుష్ కెప్టెన్ మిల్లర్ కూడా అదే డేట్ కి పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంచి.

ఈ సినిమాపై తమిళనాట మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే తెలుగులో ఉండేది కాని గుంటూరుకారం, హనుమాన్ రేసులో ఉండటంతో కెప్టెన్ మిల్లర్ సౌండ్ లేదు. వీటితో పాటు శివకార్తికేయన్ పాన్ ఇండియా మూవీ ఆయలాన్ కూడా అదే రోజు రిలీజ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో ఎలియన్ పాత్ర కూడా ఉండటంతో కొంత ఆసక్తి క్రియేట్ చేస్తోంది.

ఇలా సూపర్ స్టార్ మహేష్ బాబుకి పోటీగా ఏకంగా నాలుగు సినిమాలు జనవరి 12న రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ఏది ప్రేక్షకులని భాగా ఎంగేజ్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. హనుమాన్ సినిమాపైన అయితే మంచి పాజిటివ్ బజ్ ప్రస్తుతం నడుస్తోంది.