Begin typing your search above and press return to search.

సంక్రాంతికి వస్తున్నాంలో క్లైమాక్స్ సర్‌ప్రైజ్‌ అతడే..!

ఈ సినిమాలో ఒక యంగ్‌ హీరో క్లైమాక్స్‌లో కనిపించబోతున్నాడు అంటూ యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.

By:  Tupaki Desk   |   16 Dec 2024 6:30 AM GMT
సంక్రాంతికి వస్తున్నాంలో క్లైమాక్స్ సర్‌ప్రైజ్‌ అతడే..!
X

వెంకటేష్‌ హీరోగా ఐశ్వర్య రాజేష్‌, మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్‌గా నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈసినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా టీం నుంచి బ్యాక్ టు బ్యాక్ వీడియోలు వస్తున్నాయి. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాపై అంచనాలు పెంచే విధంగా మరో ఆసక్తికర వార్త ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఒక యంగ్‌ హీరో క్లైమాక్స్‌లో కనిపించబోతున్నాడు అంటూ యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.

ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా క్లైమాక్స్‌లో యంగ్‌ హీరో కనిపించబోతున్నాడని, ఆయన చుట్టూ కామెడీ సన్నివేశాలు అల్లినట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఆ యంగ్‌ హీరో కనిపించిన అయిదు పది నిమిషాలు నవ్వులు పూయించడం ఖాయం అనే అభిప్రాయంను వారు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆ హీరో ఎవరు అనే విషయాన్ని లీక్ చేయలేదు. విడుదల సమయంలో రివీల్‌ చేస్తారా లేదంటే విడుదల అయ్యేంత వరకు ఆ విషయాన్ని సస్పెన్స్‌గానే ఉంచుతారా అనే విషయంలో క్లారిటీ రావాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే.

నెల రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ ఇటీవల కౌంట్‌ డౌన్ ప్రారంభించిన మేకర్స్‌ మరో పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల రమణ గోగుల పాడిన గోదారి గట్టు పాటకు మంచి స్పందన దక్కింది. వెంకటేష్‌ను ప్రేక్షకులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలాంటి కథ, కథనంతో ఈ సినిమాను అనిల్ రావిపూడి రూపొందించారు అనే వార్తలు వస్తున్నాయి. మాజీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో వెంకటేష్ కనిపించబోతున్నాడు అంటూ ఇప్పటికే యూనిట్‌ సభ్యులు విడుదల చేసిన పోస్టర్స్‌, టీజర్స్‌తో క్లారిటీ వచ్చింది.

ఈ సినిమాలో వెంకటేష్ భార్య పాత్రలో ఐశ్వర్య రాజేష్‌ నటించగా, మీనాక్షి చౌదరి ఆయన ప్రియురాలి పాత్రలో కనిపించబోతుంది. మొత్తానికి వింటేజ్ వెంకటేష్‌ను చూడటంతో పాటు, సంక్రాంతికి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను చూడబోతున్నాం అంటూ ఫ్యాన్స్‌తో పాటు ప్రతి ఒక్కరు చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ సంక్రాంతికి రామ్‌ చరణ్‌, శంకర్‌ల గేమ్‌ ఛేంజర్‌ సినిమాతో పాటు బాలకృష్ణ, బాబీల 'డాకు మహారాజ్‌' సినిమాలు విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలతో పాటు సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి.