ఫ్యాన్సీ రేటుకు సంక్రాంతికి వస్తున్నాం డిజిటల్ రైట్స్
గత నెలలో సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో విజేతగా నిలిచిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం.
By: Tupaki Desk | 7 Feb 2025 12:27 PM GMTగత నెలలో సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో విజేతగా నిలిచిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో వెంకీ సరసన ఐశ్వర్యా రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఫస్ట్ షో నుంచే సంక్రాంతికి వస్తున్నాం మంచి టాక్ తో దూసుకెళ్లింది.
ఓపెనింగ్స్ నుంచే ఈ సినిమా కలెక్సన్స్ పరంగా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. సినిమా రిలీజై మూడు వారాలు దాటినా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ కొన్ని థియేటర్లలో ఈ సినిమా మంచి రన్ తో ముందుకెళ్తుంది. సినిమా ఇంకా థియేటర్లలో రన్ అవుతుండగానే నెటిజన్లు ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు.
ఇప్పటికే రూ.300 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా కోసం ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సంక్రాంతికి వస్తున్నాం డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఫ్యాన్సీ రేటుకు ఈ హక్కులను జీ5 సొంతం చేసుకున్నట్టు సమాచారం.
అతి త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయాలని జీ5 సంస్థ చూస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ద్వారా దిల్ రాజు భారీ లాభాలను అందుకున్నట్టు రీసెంట్ గా వెల్లడించాడు. నైజాంలోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సుమారు రూ.40 కోట్ల మేర లాభం వచ్చిందని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ అంతా సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే వెంకీ నుంచి తర్వాత రానా నాయుడు సీజన్2 రానుండగా, మరో భారీ ప్రాజెక్టును త్వరలోనే అనౌన్స్ చేయనున్నట్టు ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి తన తర్వాతి సినిమాను ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవితో ఫిక్స్ చేసుకున్నాడు. మరో మూడు నాలుగు నెలల్లో ఆ సినిమా పట్టాలెక్కే ఛాన్సుంది.