సంక్రాంతికి వస్తున్నాం… ఇప్పటి వరకు ఎంత వసూళ్లు చేసిందంటే?
విక్టరీ వెంకటేష్ బ్లాక్ బస్టర్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈ ఏడాది ఫెస్టివల్ విన్నర్ గా నిలిచింది.
By: Tupaki Desk | 2 Feb 2025 11:23 AM GMTవిక్టరీ వెంకటేష్ బ్లాక్ బస్టర్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈ ఏడాది ఫెస్టివల్ విన్నర్ గా నిలిచింది. రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’, బాలయ్య ‘డాకు మహారాజ్’ చిత్రాలతో పోటీ పడిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి యునానమస్ గా సూపర్ హిట్ టాక్ వచ్చింది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకి మూడు వారాల తర్వాత కూడా మంచి ఆదరణ లభిస్తోంది.
వెంకటేష్ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్స్ ఈ చిత్రానికి రావడం విశేషం. అలాగే అనిల్ రావిపూడి కెరియర్ లో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా ఈ చిత్రం నిలిచింది. నిర్మాత దిల్ రాజుకి ఈ చిత్రం భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ‘గేమ్ చేంజర్’ తో దిల్ రాజుకి వచ్చిన నష్టాలు ‘సంక్రాంతికి వస్తున్నాం’ రికవరీ చేసిందని ఇండస్ట్రీలో టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమా 19 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 250.70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూళ్లు చేసింది.
తెలుగులో రీజనల్ మూవీ అత్యధిక కలెక్షన్స్ రికార్డ్ గతంలో ‘అల వైకుంఠపురంలో’ చిత్రం పేరు మీద ఉండేది. ఈ చిత్రం ఆ రికార్డ్ ని దాటేసింది. మూవీకి 148.49 కోట్ల షేర్ వచ్చింది. తద్వారా ఈ సినిమా మేకర్స్ తో పాటు బయ్యర్లకి భారీగా ప్రాఫిట్ వచ్చింది. ఇక ఏరియా వారీగా చూసుకున్న ఈ సినిమా మంచి కలెక్షన్స్ ని రాబట్టడం విశేషం.
ఈ సినిమాపైన వరల్డ్ వైడ్ గా 41.50 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. 42.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో థియేటర్స్ లోకి వచ్చింది. బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ దాటేసి ఏకంగా 105.99 కోట్ల ప్రాఫిట్ ని ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం సాధించింది. వెంకటేష్ కెరియర్ లో బెస్ట్ కలెక్షన్స్ ఈ చిత్రానికి వచ్చాయని చెప్పొచ్చు. 19 రోజుల్లో ఏరియా వారీగా ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ లెక్కలు చూసుకుంటే ఇలా ఉన్నాయి.
నైజాం: 39.84 కోట్లు
సీడెడ్: 17.61 కోట్లు
ఉత్తరాంధ్ర: 20.97 కోట్లు
తూర్పు గోదావరి: 13.24 కోట్లు
పశ్చిమ గోదావరి: 8.53 కోట్లు
గుంటూరు: 10.05 కోట్లు
కృష్ణా: 9.23 కోట్లు
నెల్లూరు: 4.47 కోట్లు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టోటల్ - 123.94 కోట్ల షేర్(199.90 కోట్ల గ్రాస్)
కర్ణాటక+రెస్ట్ ఆఫ్ ఇండియా: 8.35 కోట్లు
ఓవర్సీస్: 16.20 కోట్లు అంచనా
ప్రపంచవ్యాప్త కలెక్షన్స్ - 148.49 కోట్ల షేర్( 255.70 కోట్ల గ్రాస్)