RRR - పుష్ప 2 రికార్డులు బ్రేక్.. ఇది వెంకీ 'విజయ'నగరం!
పండుగ సీజన్‌ను పర్ఫెక్ట్ గా వినియోగించుకుని, వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబినేషన్ మరోసారి తమ సత్తాను చాటింది.
By: Tupaki Desk | 21 Jan 2025 6:25 AM GMTసంక్రాంతి పండుగ అనేది తెలుగు సినిమాలకు పర్ఫెక్ట్ టైమింగ్ లాంటిది. ఈ సీజన్‌లో విడుదలైన కంటెంట్ సినిమాలకు ఎల్లప్పుడూ ఆదరణ ఉంటుంది. ఇక విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. విజయనగరం ప్రాంతంలో తొలి వారంలో ఈ సినిమా భారీ వసూళ్లతో టాప్‌లో నిలిచింది. పండుగ సీజన్‌ను పర్ఫెక్ట్ గా వినియోగించుకుని, వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబినేషన్ మరోసారి తమ సత్తాను చాటింది.
తొలి వారంలో సంక్రాంతికి వస్తున్నాం విజయనగరంలో ₹2,21,36,978/- వసూళ్లు సాధించి, ఈ ప్రాంతంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. సినిమా విడుదలైనప్పటి నుండి మౌత్ టాక్, ఫ్యామిలీ ఆడియెన్స్ ప్రోత్సాహంతో ఈ సినిమాకు తిరుగులేదని చెప్పాలి. ఇక గతంలో విజయనగరం బాక్సాఫీస్‌ను శాసించిన రాజమౌళి RRR, ఇప్పుడు రెండో స్థానంలో నిలిచింది. ఈ చిత్రానికి మొత్తం ₹2,17,52,122/- వసూళ్లు వచ్చాయి.
అలాగే, ఇటీవల విడుదలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. ఇది టాప్ ప్లేస్ లో ఉంటుందని అందరూ అనుకున్నప్పటికి సంక్రాంతికి వస్తున్నాం నెంబర్ వన్ స్పాట్ ను దక్కించుకుంది, మంచి వసూళ్లను సాధించింది. పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్‌గా నిలిచిన ప్రభాస్ కల్కి 2898 AD, అలాగే బాలీవుడ్, సౌత్ మార్కెట్‌లలో భారీగా వసూళ్లు సాధించిన బాహుబలి 2 చిత్రాలు కూడా ఈ జాబితాలో ఉన్నా, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అన్ని రికార్డులను బ్రేక్ చేసేసింది.
మరోవైపు రామ్ చరణ్ తాజా చిత్రం గేమ్ ఛేంజర్ విజయనగరం ప్రాంతంలో ₹1,02,37,696/- వసూళ్లు సాధించి ఈ జాబితాలో పదో స్థానంలో నిలిచింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రాకపోయినా కూడా సంక్రాంతి సీజన్ ను మొదట్లో బాగానే ఉపయోగించుకుంది. ఇక టాక్ నెగిటివ్ గా వుండడంతో పెద్దగా వర్కౌట్ కాలేదు.
విజయనగరం టాప్ 10 వసూళ్ల జాబితా:
1. సంక్రాంతికి వస్తున్నాం - ₹2,21,36,978/-
2. ఆర్ ఆర్ ఆర్ - ₹2,17,52,122/-
3. పుష్ప 2 - ₹1,86,60,629/-
4. కల్కి 2898 AD - ₹1,75,14,885/-
5. బాహుబలి 2 - ₹1,60,48,685/-
6. దేవర - ₹1,39,39,413/-
7. అల వైకుంఠపురములో - ₹1,29,36,296/-
8. సలార్ - ₹1,24,45,793/-
9. వకీల్ సాబ్ - ₹1,13,84,979/-
10. గేమ్ ఛేంజర్ - ₹1,02,37,696/-