సంక్రాంతికి వస్తున్నాం… టార్గెట్ చిన్నదే
విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ జనవరి 14న థియేటర్స్ లోకి వస్తోంది.
By: Tupaki Desk | 7 Jan 2025 11:45 AM GMTవిక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ జనవరి 14న థియేటర్స్ లోకి వస్తోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని చాలా వేగంగా కంప్లీట్ చేసేసాడు. అలాగే పెద్దగా వేస్ట్ అవుట్ ఫుట్ లేకుండా చాలా షార్ప్ గా కంటెంట్ ని తెరకెక్కించాడని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు. పక్కా ప్లానింగ్ తో వెళ్లడం వలన చాలా తొందరగా ఫినిష్ అయిపోయిందట.
ఇదిలా ఉంటే ఈ మూవీ జనవరి 14న థియేటర్స్ లోకి వస్తోంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కుటుంబ ప్రేక్షకులకి బాగా చేరువ అవుతుందని అనుకుంటున్నారు. విక్టరీ వెంకటేష్ కూడా చాలా రోజుల తర్వాత పూర్తిస్థాయిలో ఈ సినిమాలో వినోదాన్ని పండించారు. అతనికి తోడు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కూడా అదిరిపోయే రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ జెనరేట్ చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాలలో చాలా తక్కువ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. నైజాంలో దిల్ రాజు స్వయంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇక ఆంధ్రాలో 15 కోట్లకి థీయాట్రికల్ రైట్స్ అమ్మేశారు. ఇక సీడెడ్ 5 కోట్లకి సేల్ చేశారు. అంటే 50 కోట్ల కంటే తక్కువ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తోనే ఈ చిత్రం థియేటర్స్ లోకి వస్తోంది. ఇప్పటికే మూవీపైన పాజిటివ్ బజ్ నడుస్తోంది.
మినిమమ్ బాగుందనే టాక్ వస్తే ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకొని భారీ లాభాలు కొల్లగొట్టడం గ్యారెంటీ అని అనుకుంటున్నారు. విక్టరీ వెంకటేష్ కూడా సాలిడ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ మూవీ సక్సెస్ అయితే అతని మార్కెట్ రేంజ్ కూడా పెరుగుతుంది. ఇప్పటికే రాజమౌళి తర్వాత తెలుగులో వరుస హిట్స్ అందుకున్న డైరెక్టర్ గా అనిల్ రావిపూడి ఉన్నారు.
ఈ మూవీ సక్సెస్ అందుకుంటే నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి చేయబోయే సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయం. అది కూడా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గానే ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దిల్ రాజుకి వరుస సక్సెస్ లు ఇచ్చిన అనిల్ రావిపూడి దీంతో మరో హిట్ ని అందిస్తాడో లేదో వేచి చూడాలి.