సంక్రాంతికి వస్తున్నాం.. బుక్ మై షోలో 2 మిలియన్ జాతర
గడిచిన 24 గంటల్లో కూడా బుక్ మై షోలో ఈ సినిమానే టాప్ ట్రెండ్ లో ఉండడం విశేషం.
By: Tupaki Desk | 18 Jan 2025 11:16 AM GMTవిక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సంక్రాంతి పండుగ సీజన్‌ను ఏకంగా షేక్ చేస్తోంది. ఈ చిత్రానికి వచ్చిన తొలి రోజు హైప్ మొదటి ఆటతోనే థియేటర్లలో దుమ్ములేపింది. కుటుంబ ప్రేక్షకుల ఆదరణతో ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందనే సంకేతాలు మొదటి ఆట నుంచే వచ్చాయి. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది.
సంక్రాంతిలో వచ్చిన బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలవడమే కాకుండా జెట్ స్పీడ్ లో బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసింది. వెంకటేష్ కెరీర్ లో కూడా వేగంగా టార్గెట్ ను ఫినిష్ చేసిన సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం.. నిలిచింది. దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. అయితే గడిచిన ఐదు రోజుల్లో బుక్మైషో వంటి టికెట్ బుకింగ్ యాప్స్‌లో ఈ సినిమాకి 2 మిలియన్ల టికెట్లు అమ్ముడయ్యాయి.
ఇప్పటివరకు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాకు ఇటువంటి రికార్డు సాధించడం చాలా అరుదు. గడిచిన 24 గంటల్లో కూడా బుక్ మై షోలో ఈ సినిమానే టాప్ ట్రెండ్ లో ఉండడం విశేషం. వెంకటేష్ నటన, అనిల్ రావిపూడి అందించిన వినోదం, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ అందించిన మ్యు5 బాగా ఆకట్టుకున్నాయి. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడమే కాదు, కుటుంబ సభ్యులతో కలిసి సినిమాను చూసే ట్రెండ్‌ను మళ్లీ తెచ్చింది.
ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ చిత్రం విపరీతమైన కలెక్షన్లతో దూసుకుపోతోంది. మొత్తం మీద ఈ సినిమా తెలుగు బాక్సాఫీస్‌కు పెద్ద బూస్ట్ ఇచ్చిందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ సినిమాతో వెంకటేష్ మరోసారి తన ఫ్యామిలీ ఆడియన్స్ క్రేజ్‌ను నిరూపించుకున్నారు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి పాత్రలు కూడా సినిమాలో ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. మేకర్స్ అందించిన కంటెంట్ ప్రేక్షకులందరికీ నచ్చడంతో రిపీట్ ఆడియన్స్ కూడా ఎక్కువగా వస్తున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విజయంతో నిర్మాత దిల్ రాజు మంచి ప్రాఫిట్స్ అందుకున్నారు. వీరి కలయికలో వచ్చిన ప్రతీ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేశాయి. అలాగే దర్శకుడు అనిల్ రావిపూడి వరుస హిట్స్ తో దూసుకుపోతున్నారు. సినిమా కలెక్షన్లు, ప్రేక్షకుల స్పందనతో థియేటర్ యాజమాన్యాలు కూడా సంతోషంగా ఉన్నాయి. ట్రేడ్ అనలిస్టులు ఈ సినిమా 200 కోట్ల వరకు రాబడుతుందని అంచనా వేస్తున్నారు.