Begin typing your search above and press return to search.

సంక్రాంతికి వస్తున్నాం.. వెంకీ వన్ మ్యాన్ షో: అనిల్ రావిపూడి

విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల డేట్ పై మొత్తానికి దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశారు

By:  Tupaki Desk   |   20 Nov 2024 2:14 PM GMT
సంక్రాంతికి వస్తున్నాం.. వెంకీ వన్ మ్యాన్ షో: అనిల్ రావిపూడి
X

విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల డేట్ పై మొత్తానికి దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశారు. జనవరి 14న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతున్నట్లు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్లో చిత్ర యూనిట్ సభ్యులు సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి కూడా తన అనుభవాలను ఈ విధంగా తెలియజేశారు.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. సంక్రాంతికి నాకు ఒక స్పెషల్ కనెక్షన్ ఉంది. అది 2019 నుంచి స్టార్ట్ అయింది. SVC సి బ్యానర్ లోనే వెంకటేష్ గారితో ఎఫ్2 అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాం. ప్రతి సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా మంచి సినిమాలతో రావడం జరుగుతోంది. అందుకే నాకు సంక్రాంతితో ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. అలాగే మహేష్ బాబు గారితో సరిలేరు నీకెవ్వరు అనే సినిమా చేయడం జరిగింది. మళ్లీ కొంత గ్యాప్ తీసుకుని నాకు ఇష్టమైన హీరో విక్టరీ వెంకటేష్ గారితో నాకు ఇష్టమైన కాంబినేషన్లో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో రావడం జరుగుతోంది.

ఫ్యామిలీ ఆడియన్స్ అందరు కూడా చూసే విధంగా ఈ సినిమా ఉంటుంది. భగవంత్ కేసరి సినిమా నుంచి నేను కొద్దిగా కాస్త రిస్కీ జోనర్స్ టచ్ చేద్దాము అని స్క్రిప్ట్ రెడీ చేయడం జరుగుతోంది. వెంకటేష్ గారి తో కూడా ఇప్పుడు అలానే చేయడం జరిగింది. రైటర్ గా కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ సినిమా అందరికీ పర్ఫెక్ట్ గా నచ్చుతుంది అని నమ్మకంగా చెప్పగలను. సినిమాలో ఎక్స్ కాప్ - ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ - ఎక్సలెంట్ వైఫ్.. వీరి ముగ్గురు మధ్య ఒక బ్యూటిఫుల్ జర్నీ ఉంటుంది. దాన్ని ఒక క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో చేయడం జరిగింది.

నేను వెంకటేష్ గారు ఇద్దరు కూడా కంప్లీట్ వేరే స్పేస్ లోకి వెళ్లి చేయాలని ముందే ఫిక్స్ అయ్యాం. ఆ విధంగానే ఈ సినిమా చేసాం. సుందరకాండ సినిమా తర్వాత వెంకటేష్ గారు మళ్ళీ కంప్లీట్ గా గ్లాస్సెస్ తో చేసిన సినిమా ఇదే కావడం విశేషం. లుక్ అయితే కొత్తగా ఉంటుంది. ఇక క్లైమాక్స్ లో వెంకీ వన్ మెన్ షో చూపిస్తారు. అంతా అద్భుతంగా అయినా పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో భాగ్యం పాత్రలో నటించిన ఐశ్వర్య రాజేష్ మంచి ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్ చేసింది.

అలాగే మీనాక్షి చౌదరి కూడా ఒక ఐపీఎస్ పాత్రలో కనిపించబోతోంది. ఆమెలో ఒక మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ ఉంది. అది పూర్తిగా ఈ సినిమాలో మీరు చూస్తారు. ఈ ముగ్గురి మధ్య జరిగే కథను తెలుగు ప్రేక్షకులు చాలా రోజులు గుర్తు పెట్టుకుంటారు. అలాగే సినిమాలో మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తాయి. ఇక ఈ సినిమాకు బీమ్స్ కూడా చాలా మంచి సంగీతం అందించాడు. ఇంకా చాలా విషయాలు రాబోయే ఈవెంట్స్ లో మాట్లాడుకుందాం. ఇక నిర్మాత దిల్ రాజు గారు అలాగే శిరీష్ గారు నాకు ఫ్యామిలీ లాంటివాళ్ళు.

వారితో నాకు ఇది ఐదవ సినిమా. SVC బ్యానర్లో సినిమా చేయడం నాకు చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ముందు ముందు ఇంకా చాలా ఫిలిమ్స్ కూడా చేస్తాను. రాజుగారికి ఈ సినిమా సంక్రాంతికి అతిపెద్ద హిట్టు కావాలి అని, అలాగే వారి బ్యానర్ లోనే రానున్న పెద్ద సినిమా గేమ్ ఛేంజర్ కూడా మరింత పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఆయన చాలా ఖర్చుపెట్టి చాలా ఎక్కువ రోజులు చేసిన సినిమా అదే. రాజుగారి కెరీర్ లోనే పెద్ద హిట్ కావాలి అని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా సినిమా కూడా మంచి హిట్ కావాలి. ఇక డాకూ మహారాజ్ కూడా ఆయనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ సీజన్ తో ఆయనను సంక్రాంతి రాజుగారు అనాలి. సంక్రాంతికి డిఫరెంట్ జానర్ ఉన్న అన్ని సినిమాలు కూడా ఆడియన్స్ కోసం సిద్ధంగా ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాలను ఎంజాయ్ చేస్తారు అని ఆశిస్తున్నాను.. అంటూ అనిల్ రావిపూడి వివరణ ఇచ్చారు.