సీడెడ్ బాక్సాఫీస్ - టాప్ 10లో వెంకీ సంక్రాంతి!
అయితే తాజాగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అక్కడ భారీ వసూళ్లు రాబడుతోంది.
By: Tupaki Desk | 6 Feb 2025 7:24 AM GMTటాలీవుడ్‌లో సీడెడ్ ఏరియా మాస్ సినిమాలకు పుట్టినిల్లు అని చెప్పొచ్చు. క్లాస్ సినిమాలు కొన్ని మంచి వసూళ్లు సాధించినా, ఎక్కువగా మాస్ సినిమాలదే హవా ఉంటుందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతుంటారు. బాహుబలి, పుష్ప, సలార్ లాంటి భారీ సినిమాలు ఇక్కడ అద్భుతమైన వసూళ్లు సాధించాయి. అయితే తాజాగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అక్కడ భారీ వసూళ్లు రాబడుతోంది.
విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు మాస్ ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పించింది. భారీ ఓపెనింగ్స్‌తో స్టార్ట్ అయిన ఈ మూవీ, సీడెడ్ ఏరియాలో భారీ వసూళ్లు రాబట్టి ఇప్పటివరకు 18.40 కోట్లు షేర్‌ను సాధించి టాప్ 10 లిస్ట్‌లో చోటు సంపాదించింది. వెంకటేష్ కెరీర్‌లో ఇదొక పెద్ద హిట్‌గా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
టాలీవుడ్ చరిత్రలో సీడెడ్ ఏరియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల లిస్ట్‌లో RRR మొదటి స్థానంలో నిలిచింది. ఈ చిత్రం ₹51.04 కోట్లు షేర్‌ను రాబట్టింది. ఆ తర్వాతి స్థానాల్లో పుష్ప 2 – ది రూల్ 35.70 కోట్లు, బాహుబలి 2 - 34.75 కోట్లు, దేవర పార్ట్ 1 31.85 కోట్లు వసూలు చేసి టాప్ లిస్ట్‌లో నిలిచాయి. గత ఏడాది విడుదలైన కల్కి 2898 ఏ.డి కూడా 21.80 కోట్లు షేర్‌ను సాధించి మంచి విజయాన్ని అందుకుంది.
ఇక సంక్రాంతికి వస్తున్నాం 18.40 కోట్లు షేర్‌ను రాబట్టి లేటెస్ట్ గా టాప్ 10 లిస్ట్‌లోకి ప్రవేశించింది. ఈ లిస్ట్‌లో చివరి స్థానంలో ఉన్న చిరంజీవి వాల్తేరు వీరయ్య 18.35 కోట్లు వసూళ్లతో నిలిచింది. సీడెడ్ ఏరియాలో మాస్ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ ఉంటుంది. భారీ బడ్జెట్ సినిమాలు, భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్స్ ఇక్కడ రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించడం సాధారణమైపోయింది. వెంకటేష్ తాజా చిత్రం కూడా అదే కోవలో చేరింది.
సీడెడ్ ఏరియా ఆల్ టైమ్ టాప్ 10 షేర్ మూవీస్:
RRR – 51.04 కోట్లు
పుష్ప 2 – ది రూల్ – 35.70 కోట్లు
బాహుబలి 2 – 34.75 కోట్లు
దేవర పార్ట్ 1 – 31.85 కోట్లు
సలార్ 1 – 22.75 కోట్లు
బాహుబలి – 21.80 కోట్లు
కల్కి 2898 ఏ.డి – 21.80 కోట్లు
సైరా – 19.11 కోట్లు
సంక్రాంతికి వస్తున్నాం – 18.40 కోట్లు
వాల్తేరు వీరయ్య – 18.35 కోట్లు