Begin typing your search above and press return to search.

సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్.. 2 రోజుల్లోనే స్టన్నింగ్ కలెక్షన్స్

సంక్రాంతికి వస్తున్నాం సినిమా పర్ఫెక్ట్ హిట్ అని ఈ నెంబర్లతో మరోసారి సంకేతాలను ఇచ్చింది.

By:  Tupaki Desk   |   16 Jan 2025 7:15 AM GMT
సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్.. 2 రోజుల్లోనే స్టన్నింగ్ కలెక్షన్స్
X

సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో పూర్తిగా విజయవంతమైంది. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ అంటేనే హిట్టు బొమ్మ అని మరోసారి నిరూపించారు. హీరోయిన్స్ క్లాష్ కూడా ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. క్రైమ్ ఫ్యామిలీ డ్రామా, కామెడీ ట్రాక్స్ లో రూపొందిన ఈ సినిమా పండుగ సీజన్‌లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.


సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద 45 కోట్ల గ్రాస్ వసూలు చేసి, అదరగొట్టింది. ఇది వెంకటేష్ కెరీర్‌లోనే ఒక బిగ్ ఓపెనింగ్‌గా నిలిచింది. రెండో రోజు కూడా అదే రేంజ్ లో ఇంపాక్ట్ చూపిస్తూ 33 కోట్ల గ్రాస్ తో మరోసారి సినిమా తన స్టామినాను చాటుకుంది. రెండు రోజుల్లోనే 77 కోట్ల గ్రాస్ ను అందుకోవడం విశేషం. సంక్రాంతికి వస్తున్నాం సినిమా పర్ఫెక్ట్ హిట్ అని ఈ నెంబర్లతో మరోసారి సంకేతాలను ఇచ్చింది.

సినిమా తీరైన కథ, నటీనటుల అద్భుతమైన యాక్టింగ్, అలాగే సంగీతం వంటి అంశాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న నేపథ్యంలో, థర్డ్ డే కోసం ముందస్తు బుకింగ్స్ బాగానే జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అదనపు స్క్రీన్లు కూడా వేసే పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం సినిమా యొక్క రిపీట్ వ్యాల్యూ. ఫ్యామిలీ ప్రేక్షకులు సినిమా ఎమోషనల్ కంటెంట్ ను ఎంతగానో ఆస్వాదిస్తున్నారు.

దాంతో, సంక్రాంతికి వస్తున్నాం చాలా థియేటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో నడుస్తోంది. ఓవర్సీస్ మార్కెట్లో కూడా సినిమా మంచి విజయాన్ని సాధిస్తోంది. ముఖ్యంగా యుఎస్‌లో సినిమా 1 మిలియన్ డాలర్ల మార్క్‌కు దగ్గరగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా మూడో రోజు 100 కోట్ల గ్రాస్‌ను దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పించగా, శిరీష్ నిర్మించారు. సంక్రాంతి సెలవులు, వెంకటేష్ ఫ్యామిలీ బ్రాండ్ ఇమేజ్, అనిల్ రావిపూడి డైరెక్షన్ కాంబినేషన్ సినిమాకు మాస్ క్లాస్ ఆడియెన్స్‌ను సమానంగా ఆకర్షించాయి. ఈ విజయంతో వెంకటేష్ అనిల్ రావిపూడి మరో సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌గా నిలిచారు.

సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ కలెక్షన్లు:

మొదటి రోజు: ₹45 కోట్లు

రెండో రోజు: ₹33 కోట్లు

రెండు రోజుల్లో మొత్తం: ₹77 కోట్లు (ప్రపంచ వ్యాప్తంగా)