Begin typing your search above and press return to search.

సంక్రాంతికి వస్తున్నాం: ఫస్ట్ వీక్ లెక్కతో పర్ఫెక్ట్ బ్లాస్ట్

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి పండుగను పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకోని బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది.

By:  Tupaki Desk   |   21 Jan 2025 6:10 AM GMT
సంక్రాంతికి వస్తున్నాం: ఫస్ట్ వీక్ లెక్కతో పర్ఫెక్ట్ బ్లాస్ట్
X

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి పండుగను పర్ఫెక్ట్ గా క్యాష్ చేసుకోని బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. పండుగ వాతావరణంలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి, అందరి అంచనాలను మించి ఈ సినిమా రికార్డులను తిరగరాస్తోంది. పండుగ తరువాత కూడా అదే తరహాలో రికార్డులు బ్లాస్ట్ చేయడం విశేషం. కంటెంగ్ ఆడియెన్స్ కు కనెక్ట్ అయితే ఫలితం ఆ రేంజ్ లో ఉంటుందో ఈ సినిమా మరోసారి రుజువు చేసింది.

తొలి వారంలోనే ఈ చిత్రం సరికొత్త రికార్డును నెలకొల్పింది. 7 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 203 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా, పండుగ సీజన్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన ప్రాంతీయ తెలుగు చిత్రంగా నిలిచింది. దీనితో తెలుగు సినిమా చరిత్రలో పండుగ సీజన్‌లో సాధించిన బిగ్ సక్సెస్ గా ఈ సినిమా పేరొందింది.

అమెరికాలో ఈ సినిమా 2.3 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించి, వెంకటేష్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల కలెక్షన్ రికార్డులను అధిగమించింది. ఈ హ్యాట్రిక్ కాంబో మరోసారి తమ సత్తాను చాటుకుంది. ఇంతకుముందు వచ్చిన F2 - F3 సినిమాలు కూడా మంచి లాభాలను అందించాయి.

అనిల్ రావిపూడి మార్క్ వినోదంతో కూడిన కథనంతో పాటు వెంకటేష్ పాత్రలో చూపించిన అద్భుతమైన నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. పండుగ సందడి, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే కంటెంట్ సినిమాకు మరింత బలాన్ని ఇచ్చాయి. దిల్ రాజు సమర్పణలో, శిరీష్ నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ సినిమా, ప్రేక్షకుల నుంచి పొందుతున్న స్పందనను చూస్తే, రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను తిరగరాయనుంది.

సంక్రాంతి సెలవుల్లో ప్రేక్షకులను అలరించి, కుటుంబ సమేతంగా థియేటర్లకు రప్పించిన ఈ చిత్రం పండుగ సీజన్‌లో తెలుగు బాక్సాఫీస్ కు సరికొత్త బూస్ట్ ను ఇచ్చింది. అలాగే తెలుజి రీజినల్ లాంగ్వేజ్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాగా టాప్ లో నిలిచింది. ఇంతకుముందు ఈ రికార్డ్ లో అల్లు అర్జున్ అల.. వైకుంఠపురములో నెంబర్ వన్ స్థానంలో 180 కోట్లతో ఉండగా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆ లెక్కను దాటి 200 కోట్ల గ్రాస్ ను దాటడం విశేషం. ఇదే జోరు మరో వారం కొనసాగితే 300 కోట్ల మార్క్ ను కూడా టచ్ చేస్తుందని చెప్పవచ్చు.