సంక్రాంతికి వస్తున్నాం.. ఇక్కడ వెంకీ.. అక్కడ ఆయన?
ఈ సంక్రాంతికి మంచి అంచనాల మధ్య విడుదలై, ఆ అంచనాలను మించిపోయి ఎక్కడికో వెళ్లిపోయింది ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం. ఆ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని అనుకున్నారు కానీ.. మరీ 300 కోట్ల సినిమా అవుతుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు.
By: Tupaki Desk | 23 Feb 2025 3:30 PM GMTఈ సంక్రాంతికి మంచి అంచనాల మధ్య విడుదలై, ఆ అంచనాలను మించిపోయి ఎక్కడికో వెళ్లిపోయింది ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం. ఆ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని అనుకున్నారు కానీ.. మరీ 300 కోట్ల సినిమా అవుతుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. సంక్రాంతికి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే ఫ్యామిలీ మూవీ కావడంతో కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాకు పోటెత్తారు. టికెట్ల ధరలు కూడా అందుబాటులో ఉండడం కలిసొచ్చింది. ‘గేమ్ చేంజర్’తో దెబ్బ తిన్న దిల్ రాజు.. ఈ చిత్రంతో లాభాల పంట పండించుకుని సేఫ్ అయ్యాడు. ఐతే ఆయన సంబరం అంతటితో ముగియలేదు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ను హిందీలో రీమేక్ చేసి అక్కడా డబ్బులు సంపాదించడానికి ఆయన రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇందుకు చర్చలు కూడా జరుగుతున్నాయట.
బాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ను రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఐతే అక్కడ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడు. ఎవరో బాలీవుడ్ దర్శకుడినే పెట్టుకోవాలని చూస్తున్నారు. అక్షయ్ కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక ఇబ్బంది పడ్డారు. ఐతే ఇటీవలే ‘స్కై ఫోర్స్’ మూవీ సక్సెస్ అయి ఆయనకు కొంత ఉపశమనాన్ని అందించింది. ఐతే ఎక్కువగా సీరియస్ సినిమాలే చేస్తున్న అక్షయ్.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను రీమేక్ చేస్తే ఇంకా పెద్ద సక్సెస్ అందుకునే అవకాశముంది. అంతా ఓకే అయితే.. త్వరలోనే రీమేక్ గురించి అధికారిక ప్రకటన రావచ్చు. ఐతే గతంలో హిట్, జెర్సీ సినిమాల హిందీ రీమేక్‌లతో దిల్ రాజు చేతులు కాల్చకున్నారు. తనకు కలిసి రాని చోట ఆయన చేస్తున్న మూడో ప్రయత్నంలో అయినా కోరుకున్న సక్సెస్ అందుకుంటారేమో చూడాలి మరి.