'సంక్రాంతికి వస్తున్నాం'.. ఇండస్ట్రీలో చిర్రుబుర్రులు!
ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఆ మూవీ ఫస్ట్ డే నుంచే భారీ వసూళ్లు రాబడుతోంది.
By: Tupaki Desk | 2 Feb 2025 8:36 AM GMT2025 సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. విక్టరీ వెంకటేష్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఆ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఆ మూవీ ఫస్ట్ డే నుంచే భారీ వసూళ్లు రాబడుతోంది.
అయితే సుమారు రూ.60 కోట్లతో తెరకెక్కిన చిత్రం ఏకంగా రూ.300 కోట్ల రూపాయల వసూళ్లను సాధించిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో దిల్ రాజుకు చాలా పెద్ద రిలీఫ్ ఇది. రీసెంట్ గా ఆయనే చెప్పినట్లు.. ఎక్కడో పడిపోతున్న వారిని పైకి తీసుకొచ్చి అనిల్ రావిపూడి మళ్లీ దృఢంగా నిలబెట్టాడనే చెప్పాలి.
అదే సమయంలో మేకర్స్ నిన్న మూవీ డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ నిర్వహించారు. ఆ సందర్భంగా కొవిడ్ నుంచి గతుకు రోడ్డుపై ప్రయాణిస్తున్న తమను తారు రోడ్డు పైకి ఎక్కించాడని అనిల్ ను కొనియాడారు దిల్ రాజు. తమకు కొన్ని వీక్నెస్ ఉంటాయని అన్నారు. డిస్ట్రిబ్యూటర్లు తలెత్తుకునేలా చేసిన చిత్రం సంక్రాంతికి వస్తున్నామని అన్నారు శిరీష్.
ఈవెంట్ లో చాలా రోజుల తమకు తర్వాత 20 శాతం కమిషన్ వచ్చిందని తెలిపారు డిస్ట్రిబ్యూటర్ ఎల్‌వీఆర్. తాము డబ్బు పోగొట్టుకున్నా బయటకు చెప్పలేని పరిస్థితి అని అన్నారు. నిజం చెబితే నెక్స్ట్ సినిమా ఇవ్వరని, అప్పుడు నష్టపోతామని అన్నారు. డబ్బులు రాకపోయినా సైలెంట్ గా ఉంటామని కామెంట్ చేశారు.
అదే సమయంలో కలెక్షన్స్ విషయంలో డిస్ట్రిబ్యూటర్స్ అబద్ధం ఆడినా.. నిర్మాత అబద్ధం ఆడినా.. మీడియా అబద్ధం ఆడినా.. ప్రేక్షకులు నమ్మడం లేదని ఆయన అన్నారు. డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర వైటే ఎక్కువ ఉంటుందని, జీఎస్టీ వచ్చాక ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూన్నామని హరి అన్నారు. 18 పర్సెంట్ రికవరీ ఉంటుందని తెలిపారు.
ప్రతీ లక్ష రూపాయలకు 18000 ఇన్వాయిస్ వస్తుందని, అందుకే అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు. క్యాష్ ఇచ్చే రోజులు పోయాయని అన్నారు. జీఎస్టీ వల్ల సినిమా తేడా వచ్చినా డబ్బులు వస్తున్నాయని తెలిపారు. జీఎస్టీ పరిధిలో లేని థియేటర్ల నుంచి వచ్చిన వసూళ్లను కూడా బ్యాంక్ లో వేస్తామని పేర్కొన్నారు.
డిస్ట్రిబ్యూషన్ కమిషన్ కే చేస్తున్నామని అన్నారు. తక్కువ సినిమాలకే 20 పర్సంట్ కమిషన్ వస్తుందని తెలిపారు. అలా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడిన మాటలు.. ఫుల్ వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో ఇప్పుడు టాలీవుడ్ లో ఆ విషయంపై చర్చ జరుగుతోంది. చాలా మందికి అలా మాట్లాడటం నచ్చలేదని టాక్ వినిపిస్తోంది.
ఎందుకంటే గ్రాటిట్యూడ్ ఈవెంట్ లో నిర్మాతలు, బయ్యర్లు బిజినెస్ రహస్యాలు బయట పెట్టారనే చెప్పాలి. దీంతో చాలా మంది అన్నీ ఇలా స్టేజ్ ల మీద బయటపెట్టేస్తారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అలా కరెక్ట్ కాదేమోనని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి డిస్ట్రిబ్యూటర్ల హ్యాపీ మీట్ పై అంతా చిర్రుబుర్రు లాడుతున్నట్టు అర్థమవుతోంది.