Begin typing your search above and press return to search.

మరో సంక్రాంతికి మొదటి టార్గెట్ ఫిక్స్?

ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుంచి ఏకంగా నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చాయి

By:  Tupaki Desk   |   15 Jan 2024 2:30 AM GMT
మరో సంక్రాంతికి మొదటి టార్గెట్ ఫిక్స్?
X

ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుంచి ఏకంగా నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. వీటిలో హనుమాన్ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని ప్రేక్షకాదరణతో దూసుకుపోతోంది. మిగిలిన సినిమాల పరిస్థితి ఏంటనేది వాటికి వచ్చే కలెక్షన్స్ బట్టి తెలుస్తుంది. సంక్రాంతి వీకెండ్ పూర్తయ్యే సరికి ఏ సినిమా స్టామినా ఎంత అనేది పక్కా క్లారిటీ వస్తుంది.

ఇదిలా ఉంటే ఈ ఏడాది సినిమాల వేడి ఇంకా కొనసాగుతూ ఉండగానే 2025 సంక్రాంతి రేసులోకి రాబోయే మొదటి సినిమా ఏంటనేది క్లారిటీ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న విశ్వంభర మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ మూవీ సిద్ధం అవుతోంది.

ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బింబిసార తర్వాత వశిష్ట మల్లిడి దర్శకత్వంలో రాబోతున్న మూవీ ఇదే కావడంతో దీనిపై అంచనాలు భారీగా నెలకొని ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ క్లారిటీ ఇవ్వనున్నట్లు టాక్.

మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో ఇదొక బెస్ట్ మూవీ అయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్ లో డిఫరెంట్ జోనర్ లో చేస్తోన్న మూవీ కావడంతో భారీ హైప్ క్రియేట్ అయ్యి ఉంది. గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి బరిలో వాల్తేర్ వీరయ్యతో ప్రేక్షకుల ముందుకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

2025లో విశ్వంభర సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర పాన్ ఇండియా స్థాయిలో తన ప్రతాపం చూపించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో అనుష్కని హీరోయిన్ గా తీసుకునే ప్రయత్నంలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. సినిమాకి సంబందించిన క్యాస్టింగ్ గురించి త్వరలో అన్ని విషయాలు బయటకొచ్చే అవకాశం ఉంది. జగదీక వీరుడు అతిలోక సుందరి తరహాలో విశ్వంభర మూవీ ఉంటుందనే ప్రచారం నడుస్తోంది.