Begin typing your search above and press return to search.

సంక్రాంతి రేసులో హైయెస్ట్ కలెక్షన్స్ సినిమాలివే..

ఈ ఏడాది సంక్రాంతి రేసులో కేవలం సౌత్ నుంచి ఏడు సినిమాలు రిలీజ్ అయ్యాయి

By:  Tupaki Desk   |   18 Jan 2024 3:54 AM GMT
సంక్రాంతి రేసులో హైయెస్ట్ కలెక్షన్స్ సినిమాలివే..
X

సౌత్ ఇండియా సినిమాకి ఈ మధ్యకాలంలో విశేషమైన ఆదరణ లభిస్తోంది. మొదటి వారంలో భారీ కలెక్షన్స్ అందుకున్న మూవీస్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోల చిత్రాలకి మంచి మార్కెట్ ఉంది. అందుకే భారీ ఎత్తున స్క్రీన్స్ లో వారి సినిమాలని రిలీజ్ చేస్తూ ఉంటారు. ఓవర్సీస్ లో ప్రీమియర్స్ నుంచి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర థియేటర్స్ వరకు వేలల్లో ఉంటాయి.

ఈ ఏడాది సంక్రాంతి రేసులో కేవలం సౌత్ నుంచి ఏడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో తెలుగు నుంచి నాలుగు మూవీస్ ఉంటే తమిళం నుంచి మూడు సినిమాలు ఉన్నాయి. వీటిలో ఏ సినిమాకి ఆ సినిమా చాలా ప్రత్యేకమైంది కావడం విశేషం. దీంతో ఈ మూవీస్ లో కొన్నింటికి మంచి ఆదరణ లభించింది. సంక్రాంతి రిలీజ్ అయిన సినిమాలలో కలెక్షన్స్ పరంగా గుంటూరు కారం టాప్ లో ఉంది.

ఈ మూవీ ఇప్పటి వరకు ఏకంగా 140 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకుంది. తర్వాత సెకండ్ నెంబర్ గా హనుమాన్ మూవీ నిలిచింది. ఈ చిత్రం 116 కోట్ల గ్రాస్ ని ఇప్పటి వరకు వసూళ్లు చేసింది. ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తోంది. సినిమా బాగుండటంతో ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీని తర్వాత కలెక్షన్స్ పరంగా కెప్టెన్ మిల్లర్ ఉంది. ఈ మూవీ ఇప్పటి వరకు 56 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

మూవీ బడ్జెట్ తో పోల్చుకుంటే ఈ కలెక్షన్స్ చాలా తక్కువ అని చెప్పాలి. అయితే నెమ్మదిగా ఈ మూవీ ఆడియన్స్ కి రీచ్ అవుతుంది. తెలుగులో రిలీజ్ కాకపోవడం కూడా ఈ మూవీ కలెక్షన్స్ తక్కువగా కనిపించడానికి ఒక కారణం. ఇక శివ కార్తికేయన్ అయలాన్ చిత్రాన్ని ఏకంగా వంద కోట్లతో నిర్మించారు. అయితే ఇప్పటి వరకు ఈ మూవీకి 47.7 కోట్లు మాత్రమే వసూళ్లు వచ్చాయి. కింగ్ నాగార్జున నా సామి రంగా మూవీ 20.5 కోట్ల కలెక్షన్స్ ని అందుకున్నాయి.

విజయ్ సేతుపతి మేరీ క్రిస్మస్ 18 కోట్ల మేరకు కలెక్ట్ చేశాయి. విక్టరీ వెంకటేష్ సైంధవ్ 14.6 కోట్లు కలెక్ట్ చేసి ఈ ఏడాది టాలీవుడ్ నుంచి బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా నిలవబోతోంది. ఓవరాల్ గా చూసుకుంటే సంక్రాంతి హిట్ మూవీస్ గా హనుమాన్, గుంటూరు కారం, నా సామి రంగా నిలిస్తే కెప్టెన్ మిల్లర్, అయలాన్ పర్వాలేదనే స్థాయిలో ఉన్నాయి. మేరీ క్రిస్మస్, సైంధవ్ డిజాస్టర్ జాబితాలోకి వెళ్ళేలా ఉన్నాయి.