Begin typing your search above and press return to search.

సంక్రాంతి పోటీలో నలిగి పోయేది ఎవరో...!

ప్రతి ఏడాది సంక్రాంతికి స్టార్‌ హీరోల సినిమాలు చిన్న హీరోల సినిమాలు విడుదల అవ్వడం కామన్‌. 2023 సంక్రాంతికి చిరంజీవి మరియు బాలయ్య లు పోటీ పడ్డ విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   6 Oct 2023 7:06 AM GMT
సంక్రాంతి పోటీలో నలిగి పోయేది ఎవరో...!
X

ప్రతి ఏడాది సంక్రాంతికి స్టార్‌ హీరోల సినిమాలు చిన్న హీరోల సినిమాలు విడుదల అవ్వడం కామన్‌. 2023 సంక్రాంతికి చిరంజీవి మరియు బాలయ్య లు పోటీ పడ్డ విషయం తెల్సిందే. తమిళ్‌ మూవీ వచ్చినా కూడా చిరు, బాలయ్య లు ఆ డబ్బింగ్‌ సినిమాను కనిపించకుండా చేశారు. ఇక 2024 సంక్రాంతి సినిమాల గురించి ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది.

వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రభాస్ 'కల్కి' సినిమాను విడుదల చేయాలని భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా వచ్చే పరిస్థితి లేదు. దాంతో ఇతర సినిమాలు చాలానే సంక్రాంతి బరిలో దిగబోతున్నాయి. ఇప్పటికే మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కచ్చితంగా సంక్రాంతికి త్రివిక్రమ్‌, మహేష్ బాబులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంక్రాంతికి నాగార్జున నటిస్తున్న 'నా సామిరంగా' సినిమా విడుదల కాబోతుంది. షూటింగ్ ప్రారంభం సమయంలోనే సంక్రాంతికి వచ్చి తీరుతాం అంటూ మేకర్స్ ప్రకటించడంతో కచ్చితంగా నాగ్‌ సినిమా సంక్రాంతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. తాజాగా సంక్రాంతికి విడుదల అవుతున్న సినిమాల జాబితాలో సైంధవ్‌ కూడా చేరింది.

వెంకటేష్ హీరోగా నటిస్తున్న సైంధవ్ సినిమా ను సంక్రాంతి కానుకగా విడుదల చేయడం ద్వారా పోటీ మరింత రసవత్తరంగా మారబోతుంది. నాగార్జున మరియు వెంకటేష్ లు గతంలో బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డ సందర్భాలు ఉన్నాయి. అందులో ఎక్కువ శాతం వెంకటేష్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే ఈసారి వీరిద్దరితో పాటు మరి కొన్ని సినిమాలు కూడా రాబోతున్నాయి.

సంక్రాంతికి ఇంకా మూడు నెలల సమయం ఉంది కనుక ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు వాయిదా పడవచ్చు.. మరికొన్ని సినిమాలు వచ్చి చేరినా చేరవచ్చు. కనుక ఈ సంక్రాంతి పోటీలో హిట్ గా నిలిచే సినిమాలు ఏంటి... నలిగి పోయే సినిమాలు ఏంటి అనేది తెలియాలంటే మరి కొన్నాళ్లు వెయిట్‌ చేయాల్సిందే.