సంక్రాంతి రేసులో కొత్తగా మరో ఇద్దరు స్టార్లు
ఎవరూ వెనక్కి తగ్గడానికి సిద్దంగా లేరు. ఏర్పాటు చేసిన సమావేశాలు విఫలమయ్యాయి తప్ప సఫలం కాలేదు
By: Tupaki Desk | 3 Jan 2024 4:30 PM GMTఇప్పటికే సంక్రాంతి రేసులో ఐదు సినిమాలు క్యూ లో ఉన్న సంగతి తెలిసిందే. జనవరి 12న 'గుంటూరు కారం'..'హనుమాన్' చిత్రాలు రిలీజ్ అవుతుండగా..ఆ మరుసటి రోజున 'ఈగిల్'..'సైంధవ్' చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక జనవరి 14 కింగ్ నాగార్జున నటిస్తోన్న 'నా సామిరంగ' రిలీజ్ అవుతుంది. ఇలా వరుసగా ఐదు సినిమాలు గ్యాప్ లేకుండా రిలీజ్ అవుతున్నాయి. దీంతో వీటికే థియేటర్ల సర్దుబాటు ఎలా? అని నిర్మాతలంతా తలలు పట్టుకుంటున్నారు.
ఎవరూ వెనక్కి తగ్గడానికి సిద్దంగా లేరు. ఏర్పాటు చేసిన సమావేశాలు విఫలమయ్యాయి తప్ప సఫలం కాలేదు. దీంతో రిలీజ్ రేసులో ఎవరూ తగ్గమంటున్నారు తేలిపోయింది. ఇప్పుడీ వరుసలోకి డబ్బింగ్ సినిమాలు కూడా చేరాయి. పోటీగా మేము కూడా ఉన్నామంటూ తమిళ హీరోలు సిద్దమయ్యారు. అక్కడా ఏటా పొంగల్ కానుగా రిలీజ్ అవ్వడం అన్నది అనవాయితీగా వస్తున్నదే. అయితే తెలుగులో సైతం ఇక్కడ సినిమాలకు పోటీగానూ రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.
కోలీవుడ్ స్టార్ హీరోలు ధనుష్...శివ కార్తికేయన్ టాలీవుడ్ స్టార్లకు పోటీగా దిగుతున్నారు. ధనుష్ నటిస్తోన్న 'కెప్టెన్ మిల్లర్' చిత్రాన్ని ..శివ కార్తికేయన్ నటిస్తోన్న 'ఆయలాన్' చిత్రాన్ని జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రెండు సినిమాలపై కూడా భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా ధనుష్ సినిమాపై అంచనాలు పీక్స్ లోనే ఉన్నాయి. పైగా ధనుష్ 'సార్' సినిమాతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. దీంతో సినిమా ప్రభావం తెలుగు చిత్రాలపై పడుతుందా? అన్న సందేహం తలెత్తుతుంది.
ఇప్పుడీ సినిమాలన్నింటికి థియేటర్ల సర్దుబాటు ఎలా అన్నది అత్యంత కీలకంగా మారింది. తెలుగు సినిమాల్నే వాయిదా వేసుకోమని దిల్ రాజు కోరిన సంగతి తెలిసిందే. ఆయన కూడా తన చిత్రాన్ని మార్చికి వాయిదా వేసుకున్నారు. మరో ఒకరు వెనక్కి తగ్గితే ఇబ్బంది ఉండదని ఆయనకు తోచిన సలహా ఇచ్చారు. కానీ ఆ మాట ఎవరూ వినలేదు. డంకీ..సలార్ ఒక్కరోజు గ్యాప్ లో రిలీజ్ అయితే వసూళ్ల పై ఎలాంటి ప్రభావం పడిందో తెలిసిందే.