అజ్ఞాతవాసి సంక్రాంతి.. మళ్ళీ అదే సీన్
ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఏకంగా ఐదు సినిమాలు బరిలో ఉన్నాయి. ఈ ఐదు మూవీస్ కూడా దేనికదే ప్రత్యేకమైనది కావడం విశేషం
By: Tupaki Desk | 4 Jan 2024 4:03 AM GMTఈ ఏడాది సంక్రాంతి బరిలో ఏకంగా ఐదు సినిమాలు బరిలో ఉన్నాయి. ఈ ఐదు మూవీస్ కూడా దేనికదే ప్రత్యేకమైనది కావడం విశేషం. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. సూపర్ స్టార్ కి పోటీగా ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాని అదే రోజు రిలీజ్ చేస్తున్నాడు. అంతపెద్ద హీరోతో వస్తోన్న ఎలాంటి భయం లేకుండా కంటెంట్ మీద నమ్మకంతో ఉన్నాడు.
జనవరి 13న విక్టరీ వెంకటేష్ సైంధవ్ మూవీ రిలీజ్ కాబోతోంది. అదే రోజు రవితేజ ఈగల్ కూడా రిలీజ్ కాబోతోందని చెప్పారు. అయితే ఇప్పటి వరకు సినిమా ప్రమోషన్ యాక్టివిటీస్ అయితే చిత్ర యూనిట్ చేయలేదు. గ్రాండ్ స్కేల్ పైన రిలీజ్ అవుతోన్న మూవీపై బజ్ లేదు. జనవరి 14న కింగ్ నాగార్జున నా సామి రంగా రావడం ఖాయం అయిపొయింది. తాజాగా సాంగ్ వదిలి మరోసారి కన్ఫర్మ్ చేశారు.
మార్కెట్ లెక్కల ప్రకారం చూసుకుంటే ఈ సంక్రాంతి బరిలో వస్తోన్న సినిమాలలో ఒక్క గుంటూరుకారం తప్ప అన్ని స్మాల్ రేంజ్ టార్గెట్ తోనే వస్తున్నాయి. ఆ సినిమా మాత్రమే వంద కోట్లకి పైగా షేర్ కలెక్షన్స్ టార్గెట్ తో రిలీజ్ అవుతోంది. 2018లో కూడా ఇలాగే సంక్రాంతి బరిలో ఐదు సినిమాలు రిలీజ్ కి సిద్ధం అయ్యాయి. అప్పుడు ఒక్క అజ్ఞాతవాసి తప్ప మిగిలినవన్నీ స్మాల్ రేంజ్ మూవీస్ కావడం విశేషం.
అయితే అజ్ఞాతవాసికి భయపడి మిగిలిన సినిమాలన్నీ వెనక్కి వెళ్ళాయి. అందులో బాలయ్య జైసింహ, రాజ్ తరుణ్ రంగుల రాట్నం, సూర్య డబ్బింగ్ మూవీ గ్యాంగ్, అనుష్క భాగమతి ఉన్నాయి. అయితే అజ్ఞాతవాసి ఇంపాక్ట్ ఉంటుందని మిగిలిన సినిమాలు డేట్స్ మార్చుకున్నాయి. ఆ ఏడాది అజ్ఞాతవాసి డిజాస్టర్ అయ్యింది. తరువాత వచ్చిన జైసింహ ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది. రంగుల రాట్నం డిజాస్టర్ అయ్యింది, గ్యాంగ్ కూడా ఫ్లాప్ అయ్యింది.
అనుష్క భాగమతి మూవీ అయితే పెద్ద హిట్ అయ్యింది. అయితే ఈ సినిమా సంక్రాంతి రేసులో ఉండి ఉంటే ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వచ్చేది. కాని అజ్ఞాతవాసికి భయపడి వెనక్కి తగ్గారు. దీంతో ఆ ఏడాది సంక్రాంతి వృధా అయ్యింది. అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందేమో అనే ఉద్దేశ్యంతోనే ఈ సారి సంక్రాంతి రేసులో ఉన్న ఏ ఒక్క నిర్మాత కూడా తమ సినిమాని పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది.