2024 ఆల్ టైమ్ బిగ్గెస్ట్ సంక్రాంతి.. ఎందుకంటే..
సక్సెస్ పరంగా చూసుకుంటే నా సామిరంగా రెండో స్థానంలో ఉంది. తరువాత గుంటూరు కారం, సైంధవ్ సినిమాలు నిలిచాయి
By: Tupaki Desk | 14 Feb 2024 3:45 AM GMTప్రతి సంక్రాంతికి టాలీవుడ్ లో పెద్ద సినిమాలు పోటీ పడుతూ ఉంటాయి. అలాగే సంక్రాంతి రేసులో రిలీజ్ అయ్యే సినిమాలలో కచ్చితంగా ఒకటి, రెండు హిట్స్ ఉంటాయి. అందుకే ఆ సీజన్ ని టాలీవుడ్ స్టార్స్, నిర్మాతలు, దర్శకులు అందరూ కూడా సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు. కచ్చితంగా సంక్రాంతి రేసులో తమ సినిమాని ఉంచాలని అనుకుంటారు.
ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఏకంగా నాలుగు తెలుగు సినిమాలు పోటీ పడ్డాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం, తేజా సజ్జా హనుమాన్, విక్టరీ వెంకటేష్ సైంధవ్, కింగ్ నాగార్జున నా సామిరంగా మూవీస్ రిలీజ్ అయ్యాయి. వీటిలో సంక్రంతి విన్నర్ గా హనుమాన్ మూవీ నిలిచింది. ఈ సినిమా ఏకంగా 300 కోట్ల గ్రాస్ ని ప్రపంచ వ్యాప్తంగా కలెక్ట్ చేసింది.
సక్సెస్ పరంగా చూసుకుంటే నా సామిరంగా రెండో స్థానంలో ఉంది. తరువాత గుంటూరు కారం, సైంధవ్ సినిమాలు నిలిచాయి. ఈ నాలుగు సినిమాలు కలిపి బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 535 కోట్లు కలెక్ట్ చేసి సంచలన రికార్డ్ క్రియేట్ చేశాయి. ఆల్ టైం సంక్రాంతి సీజన్ హైయెస్ట్ కలెక్షన్స్ గా ఈ నెంబర్ నిలిచింది. హనుమాన్ 300 కోట్ల వరకు కలెక్ట్ చేస్తే, గుంటూరు కారం 180 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది.
నా సామిరంగా సైంధవ్ కలిపి 55 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేశాయి. ఈ స్థాయిలో కలెక్షన్స్ ఏ సంక్రాంతి సీజన్ కి రాలేదు. 2020 సంక్రాంతి సీజన్ లో 500 కోట్ల గ్రాస్ వసూళ్లు అయ్యింది. దానిని 2024 బ్రేక్ చేసింది. అయితే కేవలం తెలుగు కలెక్షన్స్ పరంగా చూసుకుంటే మాత్రం 2020 సంక్రాంతి సీజన్ టాప్ చైర్ లో ఉంటుంది. ఓవరాల్ లెక్కలు తీసుకుంటే మాత్రం ఈ సీజన్ ఆల్ టైం నెంబర్ వన్ గా ఉంది.
ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాల మార్కెట్, స్టామినా పెరుగుతుందని చెప్పడానికి ఈ లెక్కలు చాలు. కంటెంట్ బలంగా ఉంటే క్యాస్టింగ్ తో సంబంధం లేకుండానే ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ దక్కించుకోవచ్చని, కార్తికేయ 2, హనుమాన్ చిత్రాలు ప్రూవ్ చేశాయి. ఇకపై ఇదే దారిలో ఎక్కువ మంది దర్శకులు, హీరోలు నడిచే అవకాశం ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది.