Begin typing your search above and press return to search.

సంక్రాంతి సినిమాలు ఆ వైభవం తెస్తాయా..?

ఫ్యామిలీ మొత్తం ఫ్రీ షో నెల తర్వాత వస్తున్నప్పుడు దానికి వేలకు వేలు ఖర్చు పెట్టి ఎందుకు చూడాలని ఫిక్స్ అయ్యారు.

By:  Tupaki Desk   |   10 Jan 2025 3:50 AM GMT
సంక్రాంతి సినిమాలు ఆ వైభవం తెస్తాయా..?
X

ఒకప్పుడు సినిమా వచ్చింది అంటే ఇంటిల్లిపాది సినిమా చూసే ఛాన్స్ ఉండేది. స్టార్ సినిమా అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఉంటారు. ఇక పండగ వచ్చింది అంటే సినిమాలకు ఫ్యామిలీస్ తో క్యూ కడతారు. ఐతే ప్రస్తుతం పెరిగిన టికెట్ రేట్ల వల్ల ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చూడాలంటే చాలా కష్టం అవుతుంది. ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ ఒకసారి ఫ్యామిలీ మొత్తం థియేటర్ కి తీసుకెళ్తే అక్కడ టికెట్ రేట్లు, తినుబండారాల ఖర్చు చూసి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందుకే చాలా వరకు సినిమా డిజిటల్ రిలీజ్ అదే ఓటీటీ రిలీజ్ అయ్యాకే చూస్తున్నారు.

ఫ్యామిలీ మొత్తం ఫ్రీ షో నెల తర్వాత వస్తున్నప్పుడు దానికి వేలకు వేలు ఖర్చు పెట్టి ఎందుకు చూడాలని ఫిక్స్ అయ్యారు. ఐతే సినిమా అంటే థియేటర్ లో 70 MM స్క్రీన్ మీద చూస్తేనే అదో కిక్. అందుకే చాలా సినిమాలకు టికెట్ రేట్లు పెంచకుండానే నామినల్ ప్రైజ్ లతో రిలీజ్ చేస్తున్నారు. ఐతే ఎప్పుడు ఎలా ఉన్నా సంక్రాంతికి ఫ్యామిలీస్ థియేటర్ బాట పట్టే ఛాన్స్ ఉంటుంది. ఈ టైం లో టికెట్ ప్రైజ్ గురించి పెద్దగా ఆలోచించే అవకాశం ఉండదు.

ఈ సంక్రాంతికి ముచ్చటగా మూడు క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు వస్తున్నాయి. ఫ్యామిలీలో ఏ అభిరుచి గల ప్రేక్షకుడికి అలాంటి సినిమా వస్తుంది. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలు మాస్ ప్రియులను అలరించేలా వస్తుండగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తుంది.

మరి ఈ సంక్రాంతికి అయినా ఫ్యామిలీస్ థియేటర్ లకు వస్తారా అలా వస్తే థియేటర్లకు పూర్వ వైభవం వచ్చినట్టే లెక్క. అలా వస్తే సినిమాకు కలెక్షన్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. మరి సంక్రాంతి శోభ కుటుంబ సభ్యులతో ఇళ్ల దగ్గరే కాదు థియేటర్ దగ్గర కూడా ఆ పండగ శోభ ఉండేలా చేస్తారా లేదా అన్నది చూడాలి. వెంకటేష్ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి సినిమా హిట్ టాక్ వస్తే తప్పకుండా కుటుంబ ప్రేక్షకులు కదిలే ఛాన్స్ ఉంటుంది.