సంక్రాంతి ఫైట్.. అటు క్లాస్.. ఇటు మాస్..!
చరణ్ పాన్ ఇండియా మూవీతో పాటుగా బాలయ్య డాకు మహరాజ్ మాస్ మూవీ.. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అనే క్లాస్ ఎంటర్టైనర్ తో సంక్రాంతిని మరింత కలర్ ఫుల్ చేసేందుకు వస్తున్నారు.
By: Tupaki Desk | 19 Nov 2024 11:30 AM2025 పొంగల్ ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. ఇప్పటికే సంక్రాంతికి ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయన్నది దాదాపు కన్ఫర్మ్ అయ్యాయి. సంక్రాంతి ఫైట్ లో ఈసారి సీనియర్ స్టార్స్ తో పోటీ పడుతున్నా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. పొంగల్ రేసులో మొదటగా గేమ్ ఛేంజర్ సినిమాతో రాబోతున్నాడు. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.
ఇండియన్ 2 ఫ్లాప్ అవ్వడం తో ఆ ఇంపాక్ట్ గేమ్ ఛేంజర్ మీద ఉన్నా కూడా సినిమాతో ఎలాగైనా సెన్సేషనల్ హిట్ కొట్టాలని చూస్తున్నారు చిత్ర యూనిట్. సినిమాలో రియల్ లొకేషన్స్ తో పాటుగా శంకర్ మార్క్ భారీతనం ఉండబోతుందని ఈమధ్య రిలీజైన టీజర్ చూస్తే అర్ధమవుతుంది. గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10న రిలీజ్ లాక్ చేశారు.
ఇక మరోపక్క ఈ సినిమా తర్వాత బాలకృష్ణ డాకు మహారాజ్ వస్తుంది. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా బాలయ్య మార్క్ మాస్ మూవీగా వస్తుంది. బాబీ స్టైల్ ఆఫ్ టేకింగ్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ అందిస్తుందని డాకు మహారాజ్ టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ సినిమాకు థమన్ అందిస్తున్న మ్యూజిక్ మరోసారి బాలకృష్ణ, థమన్ కాంబో మ్యాజిక్ ని రిపీట్ చేసేలా ఉంది. సంక్రాంతికి మాస్ మసాలా మూవీగా డాకు మహారాజ్ రాబోతుంది.
వచ్చే సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ తో బరిలో దిగుతున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపుడి డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుంది. సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి. సంక్రాంతికి మూడు నాలుగు సినిమాలు రిలీజైనా ఆడియన్స్ ని మెప్పించే ఛాన్స్ ఉంటుంది.
చరణ్ పాన్ ఇండియా మూవీతో పాటుగా బాలయ్య డాకు మహరాజ్ మాస్ మూవీ.. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అనే క్లాస్ ఎంటర్టైనర్ తో సంక్రాంతిని మరింత కలర్ ఫుల్ చేసేందుకు వస్తున్నారు. మరి ఈ క్లాస్, మాస్, యాక్షన్ ఫైట్ లో ఎవరు గెలుస్తారు అన్నది చూడాలి. ఈ మూడింటితో పాటుగా అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా కూడా రిలీజ్ అంటున్నారు. ఐతే ఈ మూడు సినిమాల మధ్య ఆ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.