Begin typing your search above and press return to search.

సంక్రాంతి రేసులో ముగ్గురు రెడీ.. ఇవే అసలు డేట్స్

2025 సంక్రాంతి రేసులో కూడా పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి.

By:  Tupaki Desk   |   28 Oct 2024 6:49 AM GMT
సంక్రాంతి రేసులో ముగ్గురు రెడీ.. ఇవే అసలు డేట్స్
X

సంక్రాంతి ఫెస్టివల్ కి టాలీవుడ్ లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఆ సీజన్ లో తమ సినిమాలని రిలీజ్ చేయాలని స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు అందరూ భావిస్తారు. కంటెంట్ ఏ మాత్రం బాగున్నా కూడా సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయ్యే సినిమాలు కమర్షియల్ సక్సెస్ అందుకుంటాయి. అందుకే నిర్మాతలు కూడా సంక్రాంతికి సినిమాలని రీరిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకుంటారు. 2025 సంక్రాంతి రేసులో కూడా పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ మూవీ జనవరి 10న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా రాబోతోంది. మెగా ఫ్యాన్స్ ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. దీంతో పాటుగా నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రావడం దాదాపు ఖాయం అయిపొయింది. బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ ‘NBK109’ మూవీ చేస్తున్నారు. దీపావళికి ఈ మూవీ టైటిల్ టీజర్ రిలీజ్ కానుంది. జనవరి 12న ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.

అలాగే దిల్ రాజు బ్యానర్ లోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతోన్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని జనవరి 14న రిలీజ్ చేసే అవకాశం ఉందంట. క్రైమ్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. బాలయ్య, వెంకటేష్ సినిమాల రిలీజ్ డేట్స్ ని త్వరలో అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

ఇవి కాకుండా గీతా ఆర్ట్స్ 2 నుంచి నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘తండేల్’ కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతుందని అందరూ భావించారు. అయితే సంక్రాంతి రేసు నుంచి ‘తండేల్’ తప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో మూడు సినిమాలు సంక్రాంతి సీజన్ లో రిలీజ్ కావడం కన్ఫర్మ్ అయినట్లే. ఇవి కాకుండా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతుందని అంటున్నారు.

కానీ అదెంతవరకు సాధ్యం అవుతుందో తెలియదు. ఒక వేళ బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ రిలీజ్ అయితే పోటీ మాత్రం చరణ్, బాలయ్య, వెంకటేష్ మధ్యనే ఉండే అవకాశాలుంటాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. రామ్ చరణ్ కి ‘గేమ్ చేంజర్’ తో పాన్ ఇండియా రేంజ్ లో సాలిడ్ సక్సెస్ ఇప్పుడు చాలా అవసరం. ఈ మూవీ ఫ్లాప్ అయితే చరణ్ నెక్స్ట్ సినిమా కోసం 2026 వరకు వెయిట్ చేయాల్సిందే.