Begin typing your search above and press return to search.

సంక్రాంతి ఫైట్ హీరోల మధ్యే కాదు..!

కానీ ఈ సంక్రాంతికి స్టార్స్ తో పాటుగా ఒక స్టార్ డైరెక్టర్ ఇద్దరు టాలెంటెడ్ డైరెక్టర్ ఒక డెబటెంట్ డైరెక్టర్ మధ్య ఫైట్ అని చెప్పుకోవచ్చు.

By:  Tupaki Desk   |   10 Jan 2024 11:30 AM GMT
సంక్రాంతి ఫైట్ హీరోల మధ్యే కాదు..!
X

సంక్రాంతికి సినిమాల పండుగ షురూ అవబోతుంది. స్టార్ సినిమాలు చిన్న సినిమాలు ఇలా అన్నీ టార్గెట్ గా వస్తున్న ఈ సంక్రాంతి సీజన్ బాక్సాఫీస్ కళకళలాడబోతుంది. ఈసారి సంక్రాంతికి ముగ్గురు స్టార్స్ తమ సినిమాలతో పోటీ పడుతుండగా ఒక చిన్న సినిమా ఈ ఫైట్ లో నిలుస్తుంది. మహేష్ గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ తో పాటుగా హనుమాన్ సినిమా కూడా రేసులో దిగుతుంది.

అయితే సంక్రాంతి అంటే స్టార్స్ మధ్య ఫైట్ అనే అనుకుంటారు కానీ ఈ సంక్రాంతికి స్టార్స్ తో పాటుగా ఒక స్టార్ డైరెక్టర్ ఇద్దరు టాలెంటెడ్ డైరెక్టర్ ఒక డెబటెంట్ డైరెక్టర్ మధ్య ఫైట్ అని చెప్పుకోవచ్చు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రం శ్రీనివాస్.. మాటల మాంత్రికుడిగా ఆయన తన పెన్ పవర్ తో హిట్లు కొడుతూ వస్తున్నారు. మహేష్ లాంటి స్టార్ హీరోతో త్రివిక్రం శ్రీనివాస్ డైరెక్షన్ లో సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. ఆ అంచనాలకు తగినట్టుగానే త్రివిక్రం కథ కథనాలు ఉంటాయని తెలుస్తుంది. గుంటూరు కారం తో మరోసారి త్రివిక్రం తన స్టామినా ప్రూవ్ చేయాలని చూస్తున్నారు.

వెంకటేష్ సైంధవ్ తో వస్తున్నాడు రెండు సినిమాల అనుభవం ఉన్న డైరెక్టర్ శైలేష్ కొలను. హిట్ ఫ్రాంచైజ్ లతో హిట్ అందుకుని తన ప్రతిభ చాటిన శైలేష్ ఈసారి స్టార్ హీరోతో సైంధవ్ అంటూ వస్తున్నాడు. మంచి ఎమోషనల్ కంటెంట్ న్యూ ఏజ్ యాక్షన్ మూవీగా సైంధవ్ వస్తుంది. ఈ సినిమా ప్రచార చిత్రాలు కూడా సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చాయి. హిట్ 1, 2 సినిమాలతో సక్సెస్ అందుకున్న శైలేష్ సైంధవ్ తో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు.

ఇదే వరుసలో అ!, కల్కి, జాంబీ రెడ్డి సినిమాలతో డైరెక్టర్ గా తన టాలెంట్ చాటిన ప్రశాంత్ వర్మ ఈసారి ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో మూవీ హనుమాన్ తో సత్తా చాటాలని వస్తున్నాడు. చిన్న సినిమాగా మొదలైన ఈ మూవీ ప్రచార చిత్రాలతో వచ్చిన హైప్ తో భారీ క్రేజ్ తెచ్చుకుంది. సంక్రాంతికి రాబోతున్న స్టార్ సినిమాలకు ధీటుగా హనుమాన్ మీద కూడా సూపర్ క్రేజ్ ఏర్పడింది.

కింగ్ నాగార్జున కొరియోగ్రాఫర్ గా ఉన్న విజయ్ బిన్నిని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ చేసిన సినిమా నా సామిరంగ. ఈ సినిమాతో విజయ్ బిన్ని తన డైరెక్షన్ టాలెంట్ చూపించాలని చూస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ కూడా ఇంప్రెస్ చేసింది. దర్శకుడిగా తొలి ప్రయత్నం విజయ్ బిన్నికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

సంక్రాంతి ఫైట్ లో హీరోలతో పాటుగా డైరెక్టర్స్ మధ్య ఫైట్ కూడా ఆసక్తికరంగా మారింది. ఈ పోటీలో విజేతగా నిలిచేది ఎవరన్నది సినిమాల ఫలితాలను బట్టి తెలుస్తుంది. అయితే అన్ని సినిమాల ప్రచార చిత్రాలు ప్రమోషన్స్ మాత్రం అదరగొట్టేస్తున్నాయి. మరి ఫైట్ లో డైరెక్టర్స్ లో ఎవరు విక్టరీ సాధిస్తారన్నది చూడాలి.