Begin typing your search above and press return to search.

సంక్రాంతికి వస్తున్నాం… ట్రెండింగ్ తో కిక్కిచ్చేలా..

ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అందరిని ఎట్రాక్ట్ చేస్తోంది. అలాగే సినిమా నుంచి వచ్చిన మూడు సాంగ్స్ కూడా ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి.

By:  Tupaki Desk   |   2 Jan 2025 11:15 AM GMT
సంక్రాంతికి వస్తున్నాం… ట్రెండింగ్ తో కిక్కిచ్చేలా..
X

విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ప్రమోషన్స్ చాలా యాక్టివ్ గా నడుస్తున్నాయి. దిల్ రాజు నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ బజ్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్ లో వస్తోన్న మూడో చిత్రం ఇది కావడం విశేషం. అనిల్ రావిపూడి తన సినిమాలని చాలా యునిక్ గా ప్రమోట్ చేస్తూ ఉంటారు.

పబ్లిక్ ని ఎట్రాక్ట్ చేయడానికి క్రియేటివ్ ఐడియాలతో ప్రమోషన్స్ చేస్తూ ఉంటాడు. సాంగ్స్ రిలీజ్ లో కూడా చాలా వినూత్నమైన పద్ధతిని ఫాలో అవుతాడు. అందుకే పబ్లిక్ కూడా అనిల్ రావిపూడి సినిమాలని చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాగే మరీ ఎక్కువ ప్రయోగాలు చేయకుండా ప్రేక్షకుల కావాల్సిన ఎంటర్టైన్మెంట్ తన సినిమాలలో ఉండేలా అనిల్ రావిపూడి చూసుకుంటాడు.

అందుకే టాలీవుడ్ రాజమౌళి తర్వాత 100 శాతం సక్సెస్ రేట్ తో అనిల్ రావిపూడి స్టార్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టీం అంతా కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో మీనాక్షి చౌదరి 'బొబ్బిలి రాజా', ఐశ్వర్య రాజేష్ 'చంటి', అనిల్ రావిపూడి 'జయం మనదేరా', దిల్ రాజు 'ఘర్షణ' సినిమాలలోని గెటప్స్ వేసుకొని ఇంటర్వ్యూలో సందడి చేశారు.

ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అందరిని ఎట్రాక్ట్ చేస్తోంది. అలాగే సినిమా నుంచి వచ్చిన మూడు సాంగ్స్ కూడా ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి. వెంకటేష్ పాడిన పొంగల్ సాంగ్ ట్రెండింగ్ లో టాప్ 3లో ఉంది. మీనూ సాంగ్ టాప్ 6లో ఉండగా గోదారి గట్టు సాంగ్ టాప్ 10లో కొనసాగుతోంది.

ఇక ఐశ్వర్య రాజేష్ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూ ట్రెండింగ్ లో టాప్ 6లో ఉంది. తాజాగా వెంకటేష్ పాత సినిమాలలోని గెటప్స్ తో చేసిన ఫన్నీ ఇంటర్వ్యూ ట్రెండింగ్ లో టాప్ 1లో ఉండటం విశేషం. దీనిని బట్టి ఈ సినిమా సోషల్ మీడియాలో ఏ విధంగా సందడి చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు.

ఇదే ఊపు కొనసాగితే రిలీజ్ నాటికి సినిమాపై ఫ్యామిలీ ఆడియన్స్ ఫోకస్ కంప్లీట్ గా పడుతుందని చెప్పొచ్చు. అనిల్ రావిపూడి టార్గెటెడ్ ఆడియన్స్ కూడా ఫ్యామిలీలే కావడంతో వారికి రీచ్ చేయడం కోసం అన్ని రకాల మ్యాజిక్స్ ని ప్రమోషన్స్ లో ఉపయోగించుకుంటున్నారు. చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సాలీడ్ ఓపెనింగ్స్ అందుకోవడం గ్యారెంటీ అని అనిపిస్తోంది.