సంక్రాంతికి వస్తున్నాం అన్న వాళ్లు రావడం లేదా!
సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నది అనీల్ రావిపూడి ప్లాన్ . ఇదే ప్రపోజల్ రాజుగారు ముందుకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 15 Oct 2024 12:21 PM GMTవిక్టరీ వెంకటేష్-అనీల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆరంభంలోనే 'సంక్రాంతి వస్తున్నాం' అని సీజన్ లాక్ చేసారు. సినిమాకి కూడా అదే టైటిల్ పెడుతు న్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ముందే ఇలా సంక్రాంతి రిలీజ్ అని ప్రకటించడంతో ప్రేక్షకు లంతా ఫిక్స్ అయిపోయారు. ఇప్పట్లో ఈ సినిమా గురించి సంక్రాంతి గురించి ఆలోచించే పనిలేదని మైండ్ ఫిక్స్ అయిపోయింది. అయితే ఇప్పుడా ఫిక్సింగ్ లో మార్పులొచ్చేలా కనిపిస్తోంది.
చిత్రాన్ని సంక్రాంతి కంటే ముందుగానే రిలీజ్ చేయాలనే కొత్త ఆలోచనతో కదులుతున్నట్లు సమాచారం. జనవరి 10న ఇప్పటికే 'గేమ్ ఛేంజర్' డేట్ లాక్ చేసారు. ఈ రెండు చిత్రాలు నిర్మిస్తోంది దిల్ రాజు కాబట్టి... వెంకీ సినిమాని ముందుకు తెచ్చి గేమ్ ఛేంజర్ ని డిసెంబర్ నుంచి జనవరికి లాక్ చేసినట్లు తెలుస్తోంది. అంటే వెంకీ సినిమా క్రిస్మస్ సందర్భంగా వచ్చే అవకాశం లేకపోలేదు. దీనికి సంబంధించి మేకర్స్ తర్జన భర్జన పడుతున్నట్లు కనిపిస్తోంది.
సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నది అనీల్ రావిపూడి ప్లాన్ . ఇదే ప్రపోజల్ రాజుగారు ముందుకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. రిలీజ్ చేద్దామని ఆయన మాట ఇచ్చారుట. అనీల్ ఆ ప్రపోజల్ పెట్టడానికి ఓ బలమైన కారణం ఉంది. అనీల్ సినిమాలన్నీ ఎంటర్ టైనింగ్ ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు చూసే చిత్రాలుగా ఉంటాయి. వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.
అందులోనూ లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇవన్నీ బేరీజ్ వేసుకునే అనీల్ రావిపూడి సంక్రాంతి పర్పెక్ట్ రిలీజ్ గా ఫిక్సై రాజుగారు దగ్గరకి విషయం తీసుకెళ్లారు. కానీ ఇంతలోనే 'గేమ్ ఛేంజర్' డేట్ జనవరికి వాయిదా పడింది. మరి తుదిగా వెంకటేష్ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అన్నది తేలాలి.