Begin typing your search above and press return to search.

గుంటూరు కారం vs సైంధవ్.. వెంకీ రియాక్షన్ అదిరింది

సంక్రాంతికి పెద్దోడు, చిన్నోడు ఇద్దరూ వస్తున్నారు కదా ఈ ఫైట్ లో ఎవరు విన్ అయ్యే అవకాశం ఉందని ఓ జర్నలిస్ట్ వెంకటేష్ ని ప్రశ్నించారు.

By:  Tupaki Desk   |   16 Oct 2023 11:15 AM GMT
గుంటూరు కారం vs సైంధవ్.. వెంకీ రియాక్షన్ అదిరింది
X

వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తోన్న గుంటూరు కారం మూవీ రిలీజ్ కాబోతోంది. అలాగే విక్టరీ వెంకటేష్ శైలేష్ కోణాలు దర్శకత్వంలో చేస్తోన్న సైంధవ్ కూడా రిలీజ్ కాబోతోంది. ఈ రెండు సినిమాలు భిన్నమైన జోనర్ లో తెరకెక్కుతున్నవే కావడం విశేషం.

తాజాగా సైంధవ్ మూవీ టీజర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. హై ఇంటెన్సన్ యాక్షన్ తో సైంధవ్ మూవీ ఉండబోతోందని టీజర్ తో క్లారిటీ వచ్చేసింది. నారప్ప తర్వాత వెంకటేష్ మరోసారి సీరియస్ రోల్ లో ఈ చిత్రంలో కనిపిస్తున్నాడు. ఈ టీజర్ రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకి విక్టరీ వెంకటేష్ ఇంటరెస్టింగ్ గా సమాధానాలు చెప్పారు.

సంక్రాంతికి పెద్దోడు, చిన్నోడు ఇద్దరూ వస్తున్నారు కదా ఈ ఫైట్ లో ఎవరు విన్ అయ్యే అవకాశం ఉందని ఓ జర్నలిస్ట్ వెంకటేష్ ని ప్రశ్నించారు. దీనికి వెంకీ అంతే ఆసక్తిగా సమాధానం చెప్పారు. ఈ పండగకి పెద్దోడుకి సూపర్ హిట్, చిన్నోడికి కూడా సూపర్ హిట్ అందులో ఎలాంటి సందేహం లేదు. అదే కదా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అని వెంకటేష్ చెప్పుకొచ్చారు.

ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వెంకటేష్ సంక్రాంతికి గుంటూరు కారంకి పోటీగా తన సైంధవ్ సినిమాని రిలీజ్ చేయబోతున్న కూడా రెండు సినిమాలు హిట్ అవ్వాలని కోరుకోవడం విశేషం. వీటిని సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు కూడా ట్రెండ్ చేస్తున్నారు. ఇద్దరి మధ్య ఎంత ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉందో వెంకటేష్ వ్యాఖ్యలే నిదర్శనం అని అంటున్నారు.

మరి సంక్రాంతి రేసులో గుంటూరు కారం, సైంధవ్ సినిమాలతో పాటుగా రవితేజ ఈగల్, ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో ఏది బిగ్ స్క్రీన్ పై బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఆడియన్స్ ని థియేటర్స్ వైపు పరుగులు పెట్టిస్తుంది అనేది వేచి చూడాలి.