Begin typing your search above and press return to search.

సంక్రాంతి పోటీ.. ఏమవుతుందో ఏంటో?

అలాగే అన్ని సినిమాలు గట్టి బ్యాక్ అప్ తోనే థియేటర్స్ లోకి రాబోతున్నాయి. పక్కా ప్లాన్ తో థియేటర్ అగ్రిమెంట్ కూడా చేసుకొని రిలీజ్ కోసం రెడీ అవుతున్నాయి

By:  Tupaki Desk   |   6 Nov 2023 7:56 AM GMT
సంక్రాంతి పోటీ.. ఏమవుతుందో ఏంటో?
X

వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో టాలీవుడ్ లో ఏకంగా ఆరు సినిమాలు పోటీ పడుతున్నాయి. ఇవన్ని కూడా దేనికవే ప్రత్యేకమైనవి కావడం విశేషం. అలాగే అన్ని సినిమాలు గట్టి బ్యాక్ అప్ తోనే థియేటర్స్ లోకి రాబోతున్నాయి. పక్కా ప్లాన్ తో థియేటర్ అగ్రిమెంట్ కూడా చేసుకొని రిలీజ్ కోసం రెడీ అవుతున్నాయి. సంక్రాంతి రేసులో ఉన్న సినిమాల సంగతి ఓ సారి చూసుకుంటే సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం ఉంది.

అలాగే విక్టరీ వెంకటేష్ సైంధవ్ మూవీ కూడా సంక్రాంతి పోటీలో ఉంది. అలాగే మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న ఈగల్, ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబోలో సిద్ధమవుతోన్న హనుమాన్, విజయ్ దేవరకొండ పరశురామ్ దర్శకత్వంలో చేస్తోన్న ఫ్యామిలీ స్టార్, నాగార్జున హీరోగా రెడీ అవుతోన్న నా సామిరంగా మూవీస్ రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.

వీటిలో గుంటూరు కారం సినిమా జనవరి 12న రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. అలాగే హనుమాన్ మూవీ కూడా అదే రోజున రిలీజ్ ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. జనవరి 13న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్, రవితేజ ఈగల్, విక్టరీ వెంకటేష్ సైంధవ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. జనవరి 14న నా సామిరంగా మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మూడు రోజుల గ్యాప్ లోనే 6 సినిమాలు థియేటర్స్ లోకి రాబోతున్నాయి.

ఈ సినిమాలు అన్ని ఒకే టైంలో రిలీజ్ కావడం వలన ప్రేక్షకులకి మాత్రం ఏ సినిమా చూడాలనేది ఛాయస్ గా ఉంటుంది. కాని నిర్మాతలకి మాత్రం నష్టం వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ సినిమాలు థియేటర్స్ లో ఉన్నప్పుడు ప్రేక్షకులకి కూడా ఏ సినిమా చూడాలనేది డిసైడ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. బ్లాక్ బస్టర్ అయ్యే సినిమాని ముందుగా చూడటానికి ఆసక్తి చూపిస్తారు. ఎవరేజ్ టాక్ వచ్చిన వాటిపై పెద్దగా ఆసక్తి చూపించారు.

డిజాస్టర్ టాక్ వస్తే మాత్రం ఆ సినిమా ఎక్కువ రోజులు థియేటర్స్ లో ఉండే అవకాశం ఉండదు. ఒక వేళ అన్ని సినిమాలకి హిట్ టాక్ వచ్చిన కూడా హీరో ఇమేజ్ బట్టి సినిమాకి ఆదరణ ఉంటుంది. మొదటి ప్రాధాన్యత గుంటూరు కారం, ఈగల్, సైంధవ్ సినిమాలు ప్రేక్షకులు చూసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. హిట్ పడిన కూడా ఇదే పోటీ కొనసాగిస్తే కమర్షియల్ సక్సెస్ అందుకోవడం కష్టం అనే టాక్ ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.