సంక్రాంతి టీమ్ కి బయ్యర్లు పార్టీ ఇస్తున్నారా?
దీనిలో భాగంగా బయ్యర్లు ఇంకా సంతోషంగా కనిపిస్తున్నారు. ఎన్నడు చూడని లాభాలను సంక్రాంతి సినిమాతో చూసారు.
By: Tupaki Desk | 1 Feb 2025 1:54 PM ISTసంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన `సంక్రాంతి కి వస్తున్నాం` బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. 300 కోట్ల వసూళ్లతో విక్టరీ వెంకటేష్-అనీల్ రావిపూడి కెరీర్ లోనే తొలి భారీ వసూళ్ల చిత్రంగా నిలిచింది. దీంతో నిర్మాత దిల్ రాజు ఇంట పంట పండింది. అదే రాజు గారు నిర్మించిన `గేమ్ ఛేంజర్` భారీ నష్టాలు తెచ్చినా? ఆ నష్టాలన్నింటిని సంక్రాంతి వస్తున్నాం లాభాలతో పూడ్చేసారు. దీంతో రాజుగారిని నమ్మి సినిమా కొన్న వాళ్లంతా సంతోషంగా ఉన్నారు.
దీనిలో భాగంగా బయ్యర్లు ఇంకా సంతోషంగా కనిపిస్తున్నారు. ఎన్నడు చూడని లాభాలను సంక్రాంతి సినిమాతో చూసారు. దీంతో ఇప్పుడు బయ్యర్లు అంతా కలిసి సంక్రాంతికి వస్తున్నాంటీమ్ కి భారీ పార్టీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారుట. డిస్ట్రిబ్యూటర్లను సంప్రదించి రాజుగారు ద్వారా టీమ్ ని అప్రోచ్ అయి పార్టీ ఆహ్వానం అందించాలని భావి స్తున్నారుట. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న బయ్యర్లు అంతా ఈ పార్టీకి పిలుపునిచ్చినట్లు చెబుతున్నారు.
పార్టీలంటే సంక్రాంతి టీమ్ అస్సలు తగ్గదు. ఈ సినిమా రిలీజ్ కు ముందు ఏ రేంజ్లో ప్రమోట్ చేసారో తెలిసిందే. విక్టరీ వెంకటేష్ హీరోయిన్లు సహా ప్రతీ ఒక్కరూ ప్రచార పర్వంగా ఎంతో సహకరించారు. అందుకే సినిమా జనాల్లోకి బలంగా వెళ్లింది. కంటెంట్ కూడా ఉండంతో బ్లాక్ బస్టర్ అయింది. అప్పటి నుంచి పార్టీలు షురూ అయ్యాయి. రాజుగా పార్టీతో పాటు వ్యక్తిగతంగా ఐశ్వర్యారాజేష్ కూడా టీమ్ అందరికీ సక్సెస్ పార్టీ ఇచ్చింది. రాజుగారు సోలోగానూ, ఫ్యామిలీతోనూ చిల్ అవుతున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా పార్టీ ఇవ్వడానికి బయ్యర్లు కూడా ముందుకు రావడం ఇంట్రెస్టింగ్. అయితే ఇందులో నిజమెంతో తెలియాలి. ఇలా బయ్యర్లు పార్టీ ఇవ్వడం అన్నది ఇంతవరకూ ఏ సినిమాకు చోటు చేసుకోలేదు. లాభాలొస్తే తీసుకుని సంతోష పండటం తప్ప ఆ సంతోషాన్ని చిత్ర యూనిట్ తో పంచుకుంది లేదు. మరి ఈ సారి ఆ ఛాన్స్ తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. మరి వేదిక ఎక్కడ? ఇందులో నిజమెంత? అన్నది రాజుగారు ధృవీక రించాల్సి ఉంది.