Begin typing your search above and press return to search.

కొత్త జంట సమస్య.. ఎంటర్టైనర్ గా 'సంతాన ప్రాప్తిరస్తు'!

'సంతాన ప్రాప్తిరస్తు'.. తెలుగు రాష్ట్రాల్లో ఈ దీవెన దంపతులను దీవించే సమయంలో వినిపిస్తుంటుంది

By:  Tupaki Desk   |   19 May 2024 5:45 AM GMT
కొత్త జంట సమస్య.. ఎంటర్టైనర్ గా సంతాన ప్రాప్తిరస్తు!
X

'సంతాన ప్రాప్తిరస్తు'.. తెలుగు రాష్ట్రాల్లో ఈ దీవెన దంపతులను దీవించే సమయంలో వినిపిస్తుంటుంది. ఇప్పుడు ఈ స్వచ్చమైన, అచ్చమైన దీవెనే టైటిల్ గా ఓ టాలీవుడ్ సినిమా రాబోతుంది. యంగ్ హీరో విక్రాంత్, టాలెంటెడ్ హీరోయిన్ చాందినీ చౌదరి లీడ్ రోల్స్ లో నటించనున్నారు. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. పలువురు ఫేమస్ టెక్నీషియన్స్ 'సంతాన ప్రాప్తిరస్తు' సినిమాకు గాను వర్క్ చేయనున్నారు.

మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్లపై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా హైదరాబాద్‌ లో గ్రాండ్‌ గా పూజా కార్యక్రమాలతో శనివారం ప్రారంభమైంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మంచి మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ముహుర్తపు సీన్ కు ప్రొడ్యూసర్, బిజినెస్ మ్యాన్ అంబికా కృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

వసుధ ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకట రామరాజు ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. మధుర శ్రీధర్ రెడ్డి తొలి షాట్‌ కు గౌరవ దర్శకత్వం చేశారు. ఇద్దరు ప్రొడ్యూసర్స్ సినిమా స్క్రిప్ట్‌ ను దర్శకుడు సంజీవ్ రెడ్డికి అందజేశారు. ఈ సినిమాకు రచయిత షేక్ దావూద్ స్క్రీన్ ప్లే రాస్తున్నారు. వెన్నెల కిషోర్, అభినవ్ గోమఠం, మురళీధర్ గౌడ్, జీవన్ కుమార్, తాగుబోతు రమేష్, రచ్చ రవి తదితరులు నటించనున్నారు.

అయితే పూజా కార్యక్రమం సందర్భంగా డైరెక్టర్ సంజీవ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కొత్తగా పెళ్లైన జంట ఎదుర్కొనే ఓ సమస్యను వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్నామని ఆయన తెలిపారు. వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి మధ్య సినిమా అంతా నడుస్తుందని చెప్పారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ ను రప్పించేలా.. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చేలా 'సంతాన ప్రాప్తిరస్తు' చిత్రం ఉంటుందని వెల్లడించారు.

'సంతాన ప్రాప్తిరస్తు; మూవీ లాంఛనంగా ప్రారంభించుకోవడం చాలా సంతోషం ఉందని నిర్మాతలు మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి తెలిపారు. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సినిమా ఉండనుందని హైప్ క్రియేట్ చేశారు. సునీల్ కశ్యప్ తమ చిత్రానికి సూపర్ హిట్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారని తెలిపారు. జూన్ 8వ తేదీ నుంచి హైదరాబాద్, వరంగల్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతామని చెప్పారు. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.