ప్రియుడితో శృతి హాసన్ ఆన్ లైన్ రొమాన్స్ వైరల్
ప్రస్తుతం ప్రేమలో ఉండటం మాత్రమే కాకుండా అంతకు మించి అన్నట్లుగా కూడా వీరిద్దరి రిలేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో రెగ్యులర్ గా వార్తల్లో ఉంటూనే ఉంటారు.
By: Tupaki Desk | 30 Aug 2023 10:52 AM GMTయూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ నట వారసురాలు శృతి హాసన్ ప్రస్తుతం హీరోయిన్ గా వరుస సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఒక వైపు సినిమాలు చేస్తూ మరో వైపు సిరీస్ ల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు గత కొంత కాలంగా శంతను హజారిక తో ప్రేమలో ఉన్న విషయం తెల్సిందే. వీరిద్దరి వీడియోలు మరియు ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి.
ప్రస్తుతం ప్రేమలో ఉండటం మాత్రమే కాకుండా అంతకు మించి అన్నట్లుగా కూడా వీరిద్దరి రిలేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో రెగ్యులర్ గా వార్తల్లో ఉంటూనే ఉంటారు. ఇద్దరు కూడా చాలా క్లోజ్ గా ఉన్న వీడియో లు, ఫోటోలు, జిమ్ లో కలిసి వర్కౌట్ లు చేస్తున్న వీడియోలు కూడా ఇప్పటి వరకు నెటిజన్స్ దృష్టిని ఆకర్షించాయి.
ఈసారి శృతి హాసన్ కు శంతను ముద్దు పెట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. శాంతను అన్నకి తెలుగు వచ్చా అంటూ ఒక నెటిజన్ ప్రశ్నించిన సందర్భంగా శృతి హాసన్ ఈ వీడియోను షేర్ చేయడం జరిగింది. అందులో చాలా క్యూట్ గా శంతను శృతి హాసన్ కు ముద్దు పెట్టాడు.
శంతనుకు తెలుగు భాష నేర్పించిన శృతి హాసన్... నేను నేర్పించిన తెలుగు మాటలు చెప్పు అన్నప్పుడు అతడు... ఇది నా బంగారం అంటూ శంతను శృతి హాసన్ ను చిలిపిగా బుగ్గపై గిల్లాడు. ఇద్దరు మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నారు అంటూ నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.
పెళ్లి కాకుండా ఈ సరసాలు ఏంటో అంటూ కొందరు విమర్శిస్తున్నారు. శంతను కు ముందు శృతి హాసన్ మరో వ్యక్తితో ప్రేమలో ఉంది. అతడితో బ్రేకప్ అయిన తర్వాత చిన్న బ్రేక్ తీసుకుని ఇతడితో రిలేషన్ లో కొనసాగింది. హీరోయిన్ గా వరుసగా సినిమా లు చేస్తూ ఉన్న శృతి హాసన్ ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేనట్లుగా ఉంది. త్వరలో శృతి హాసన్ పెళ్లి పై క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.