Begin typing your search above and press return to search.

ప్రతి సినిమా ఇలా అయితే ఎలా సంతోష్..?

కథ, స్క్రీన్ ప్లే విషయంలో కొంచెం కూడా జాగ్రత్తలు తీసుకోవడం లేదు అని సినిమా ఫలితం చూస్తేనే అర్థమౌతోంది.

By:  Tupaki Desk   |   21 Aug 2023 7:27 AM GMT
ప్రతి సినిమా ఇలా అయితే ఎలా సంతోష్..?
X

మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరోల్లో సంతోష్ శోభన్ ఒకరు. ఎలాంటి క్యారెక్టర్ అయినా చాలా ఈజ్ తో చేయగలడు. కానీ అతనిని మాత్రం అదృష్టం వరించడం లేదు. సంతోష్ శోభన్ మంచి హిట్టు కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాడు. తనకు చేతికి వచ్చిన ప్రతి సినిమాని చేస్తూనే ఉన్నాడు. కానీ హిట్ మాత్రం దొరకడం లేదనే చెప్పాలి.

సంతోష్ హీరోగా కెరీర్ మొదలుపెట్టే నాటికి ఆయన తన తండ్రిని కోల్పోయాడు. కానీ, ప్రభాస్ లాంటి స్టార్ హీరో సపోర్ట్ గా నిలిచారు. మంచి సపోర్ట్ ఉన్నా, చేయడానికి చాలా సినిమా అవకాశాలు వస్తున్నా, హీరోగా నిలదొక్కుకోవడానికి ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు. సంతోష్ వరసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. కానీ, వచ్చిన ప్రతిసినిమా అంగీకరిచడం వల్లేనేమో హిట్లు పడటం లేదు. కథ, స్క్రీన్ ప్లే విషయంలో కొంచెం కూడా జాగ్రత్తలు తీసుకోవడం లేదు అని సినిమా ఫలితం చూస్తేనే అర్థమౌతోంది.

సంతోష్ కెరీర్ లో ఏక్ మినీ కథ మూవీ తప్ప మరో హిట్ అనేది కనపడటం లేదు. ఈ మూవీ కూడా డైరెక్ట్ గా ఓటీటీలో కనిపించడం గమనార్హం. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అన్ని మంచి శకునములే సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు. కానీ, ఆ సినిమా కూడా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ప్రేమ్ కుమార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, ఈ మూవీ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తనకు సూట్ అయ్యే కామెడీ జోనర్ నే ఎంచుకున్నాడు. కానీ, పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.

సంతోష్ స్క్రిప్ట్ లను ఎంచుకోవడంలో పొరపాట్లు చేస్తూ ఉంటే, తర్వాతర్వాత కనీసం చేయడానికి సినిమాలు కూడా రాకపోవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కథలను ఎంచుకోవడంలో కొంచెం తెలివిగా ప్రదర్శించాలని, లేదంటే, ఎవరి సలహా అయినా తీసుకోవాలని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

మరి, ఈ విషయాన్ని సంతోష్ ఇకనైనా సీరియస్ గా తీసుకుంటారో లేదో చూడాలి. ఒక్క సినిమాలో పొరపాటు ఎవరికైనా జరగొచ్చు. కానీ, ప్రతి సినిమా విషయంలో అలానే జరుగుతోంది అంటే, కొంచెం అయినా, ఆలోచించాల్సిందే.