'దంగల్' బ్యూటీ ఇన్ స్టాలో దరువేస్తోందిగా!
బ్యూటీ ఎలివేషన్ల సంగతి పక్కనబెడితే డిజైనర్ డ్రెస్ లో మాత్రం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మిరుమిట్లు గొలిపే డిజైన్ సన్యా స్కిన్ టోన్ ని మరింత ప్రకాశవంతం చేస్తుంది
By: Tupaki Desk | 3 Oct 2023 6:29 AM GMTబాలీవుడ్ యంగ్ బ్యూటీ సన్యా మల్హోత్రా ఇన్ స్టా క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడు ఎప్పటికప్పుడు హీటెక్కించే ఫోటోలతో నెట్టింట హాట్ టాపిక్ గా మారుతుంది. డిజైనర్ దుస్తుల్లో సొగసరి తనని తాను చక్కగా ఫోకస్ చేసుకుంటుంది. నిత్యం ఏదో రీల్ తో ఇన్ స్టాలో హల్చల్ చేస్తూనే ఉంటుంది. తాజాగా బ్యూటీ మరో రీల్ తో ముందుకొచ్చేసింది. మిరుమిట్లు గొలిపే డిజైనర్ దుస్తుల్లో ఓ హిందీ పాటకి డాన్సు చేసింది.
బ్యూటీ ఎలివేషన్ల సంగతి పక్కనబెడితే డిజైనర్ డ్రెస్ లో మాత్రం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మిరుమిట్లు గొలిపే డిజైన్ సన్యా స్కిన్ టోన్ ని మరింత ప్రకాశవంతం చేస్తుంది. అమ్మడి మ్యాకప్ ..యాక్సరసీస్ సన్యాని మరింత అందంగా ఎలివేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. అమ్మడి అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు. ఇక బ్యూటీ కెరీర్ సంగతి చూస్తే దేదీప్య మానంగా సాగిపోతుంది.
'దంగల్' సక్సెస్ తో వరుస అవకాశాలతో బిజీ అయింది. ఇంతకాలం ఏడాదికి ఒక సినిమా చేసిన బ్యూటీ 2023 లో మరింత స్పీడప్ అయింది. ఇటీవలే 'జవాన్' తో భారీ విజయం ఖాతాలో వేసుకుంది. దీంతో 1000 కోట్లు వసూళ్లు దాటిన సినిమా మరోకటి సన్యా ఖాతాలో పడింది. దంగల్..తర్వాత జవాన్ తోనే ఆ ఫీట్ సాధించింది. ప్రస్తుతం 'సామ్ బహదూర్' ..'ది గ్రేట్ ఇండియన్ కిచెన్' రిమేక్ లోనూ నటిస్తోంది.
అమ్మడు ఈ రెండు సినిమాలపై చాలా ఆశలు పెట్టుకుంది. రెండు డిఫరెంట్ చిత్రాలు. వాటిలో సన్యా పాత్ర వైవిథ్యంగా ఉంటుందని యూనిట్ అంటోంది. ఇప్పటికే ఈ రెండు సినిమాల షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.