వీడియో: డెడ్ లిఫ్టింగ్‌తో కిల్ చేస్తున్న నటి
సన్యా మల్హోత్రా షేర్ చేసిన తాజా వీడియోలో పూర్తి శక్తితో కనిపించింది. రిథమిక్ బీట్‌ల నడుమ సాన్య 3-4 డెడ్‌లిఫ్ట్‌లను ప్రదర్శించింది.
By: Tupaki Desk | 5 Feb 2024 4:25 AM GMTసన్యా మల్హోత్రా పరిచయం అవసరం లేదు. అమీర్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ 'దంగల్' నటిగా సుపరిచితురాలు. ఆరంగేట్రమే తనదైన అద్భుత నటనతో మైమరిపించిన సాన్య కెరీర్ జర్నీ ఇప్పుడు అద్భుతంగా సాగుతోంది. ఈ భామ కాలంతో పాటే పోటీ ప్రపంచంలో తనదైన విలక్షణ శైలితో దూసుకుపోతోంది. ఇతర భామల్లానే సాన్య కూడా ఫిట్ నెస్ ఔత్సాహికురాలు. తన ఫిజిక్ ని ఫిట్ గా ఉంచుకునేందుకు చాలా తీవ్రంగానే శ్రమిస్తుంది. తాజాగా కోచ్ సమక్షంలో కఠినమైన వర్కౌట్ చేస్తున్న వీడియోతో అందరినీ ఆశ్చర్యపరిచింది సాన్య.
ఈ వీడియోలో ఓవైపు హై-ఎనర్జీ ఉపయోగించి డెడ్‌లిఫ్ట్ చేస్తోంది. అయితే అంతకుముందు సరదాగా ఓ పాటకు నృత్యం చేస్తూ డెడ్ లిఫ్ట్ బార్ వద్దకు చేరుకున్న తీరు అందరినీ నవ్వించింది. జిమ్ కోచ్ సమక్షంలో శిక్షణా సెషన్‌ను ప్రారంభించే ముందు, సన్యా మల్హోత్రా దిల్జిత్ దోసాంజ్ పంజాబీ పాట 'హాస్ హాస్ కే' పాటకు లైవ్లీ డ్యాన్స్ చేసింది.
సన్యా మల్హోత్రా తన సాధారణ వర్కౌట్ రొటీన్‌కు ఎంటర్ టైన్ మెంట్ ని జోడించి అందరినీ అలరిస్తోంది. సన్యా మల్హోత్రా షేర్ చేసిన తాజా వీడియోలో పూర్తి శక్తితో కనిపించింది. రిథమిక్ బీట్‌ల నడుమ సాన్య 3-4 డెడ్‌లిఫ్ట్‌లను ప్రదర్శించింది. డెడ్‌లిఫ్ట్‌లు అనేది వెనుక భాగం, కాళ్లు కోర్ సహా శరీరంలోని పలుచోట్ల బహుళ కండరాల సమూహాలను బలోపేతం చేసే సమ్మేళనం వ్యాయామం. సరైన పద్ధతిలో ఈ వ్యాయామం పూర్తి చేసినప్పుడు ఫలితం అంతే గొప్పగా ఉంటుంది. నిజానికి డెడ్‌లిఫ్ట్ లేమిటి? అన్నది పరిశీలిస్తే..
డెడ్‌లిఫ్ట్‌లు వెన్నెముక వెంట వెన్నెముక కండరాలను బలోపేతం చేస్తాయి. వీపు షేపులను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. డెడ్‌లిఫ్ట్‌లు అధిక తీవ్రత కలిగిన వ్యాయామం. ఇది వెనకభాగంలోని మల్టీ కండరాల సమూహాలను యాక్టివేట్ చేస్తుంది. ఈ వ్యాయామం పెరిగిన క్యాలరీలను బర్న్ చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి ఉపకరిస్తుంది.
డెడ్‌లిఫ్ట్ కోర్‌ను బలోపేతం చేయడమే కాకుండా వెనకభాగం స్థిరత్వం, సమతుల్యతను మెరుగుపరుస్తుంది. ఈ వ్యాయామం ఎముక సాంద్రతను పెంచడంలో సహాయపడుతుంది. ఇది బోలు ఎముకల వ్యాధి, ఇతర ఎముక సంబంధిత సమస్యలను నివారించడానికి సహకరిస్తుంది. డెడ్‌లిఫ్ట్‌లు వెనుక భాగం, కోర్‌లోని కండరాలను బలోపేతం చేయడం ద్వారా వెన్ను బలం పెరిగి బెడ్ పై భంగిమలను మెరుగుపరచడంలో సహాయపడతాయి.