సునీల్ ను ఫాలో అవుతున్న సప్తగిరి
ఈ నేపథ్యంలోనే సునీల్ వెళ్లిన దారిలోనే వెళ్లాలనుకుంటున్నాడు కమెడియన్ టర్డ్న్ హీరో సప్తగిరి కూడా.
By: Tupaki Desk | 19 March 2025 11:30 PM ISTసినీ ప్రపంచం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. అందుకే అందులో ఉండే సినీతారలు కూడా ఎప్పటికప్పుడు తమని అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. ఒకప్పుడు హీరోయిన్లుగా నటించిన వారు ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ చేస్తుంటే, హీరోలు కొంతమంది సపోర్టింగ్ రోల్స్, మరికొందరు విలన్ రోల్స్ చేస్తూ ఇప్పటికీ ఫామ్ ను కొనసాగిస్తున్నారు.
ఇంకొందరు కమెడియన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి, తర్వాత హీరోలుగా మారి, ఆ తర్వాత విలన్ గా, నటనా ప్రాధాన్యమున్న పాత్రల్లో కనిపిస్తూ ఆడియన్స్ ను అలరిస్తున్నారు. సునీల్ ఈ కోవకు చెందినవాడే. కెరీర్ స్టార్టింగ్ లో కమెడియన్ గా సునీల్ చేసిన కామెడీ ప్రతీ ఒక్కరినీ కడుపుబ్బా నవ్వించేది. కమెడియన్ గా ఎన్నో సినిమాలు చేసిన సునీల్ తర్వాత హీరో గా మారాడు. ఆ తర్వాత హీరోగా ఛాన్సులు తగ్గడంతో నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలను చేసుకుంటూ కెరీర్లో ముందుకెళ్తున్నాడు.
సునీల్ కమెడియన్ మాత్రమే కాదు తనలో ఒక గొప్ప నటుడున్నాడనే విషయాన్ని ఇప్పటికే పలు సినిమాలు ప్రూవ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే సునీల్ వెళ్లిన దారిలోనే వెళ్లాలనుకుంటున్నాడు కమెడియన్ టర్డ్న్ హీరో సప్తగిరి కూడా. తన కెరీర్లో ఎన్నో కామెడీ రోల్స్ చేశానని, మళ్లీ అలాంటి పాత్రలే చేయడం వల్ల కిక్ దొరకడం లేదని, సునీల్ లాగా మంచి నటనా ప్రాధాన్యం ఉండే సినిమాలు చేయాలనుందని మనసులోని మాటను బయటపెట్టాడు సప్తగిరి.
యాక్టర్ గా తన సత్తా తనకు తెలుసని, కథలోని వెయిట్ ను మోసే సత్తా తనకుందని, అందుకే రీసెంట్ టైమ్స్ లో రొటీన్ గా అనిపించే కామెడీ పాత్రలు చేయడం లేదని సప్తగిరి అంటున్నాడు. "ఆల్రెడీ కమెడియన్ గా ప్రూవ్ చేసుకున్న నేను, ఇప్పుడు మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్లు చేసి నటుడిగా కూడా ప్రూవ్ చేసుకోవాలనుందని" సప్తగిరి అంటున్నాడు.
సప్తగిరి హీరోగా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లి కాని ప్రసాద్ సినిమా మార్చి 21న ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ చిత్ర ప్రమోషన్స్ లో సప్తగిరి చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ బ్యానర్ ద్వారా ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు.