Begin typing your search above and press return to search.

OTTలో మిస్సైన సప్త సాగరాలు సైడ్ B.. రీజన్ ఏంటంటే..?

ఈ క్రమంలోనే సప్త సాగరాలు దాటి తెలుగు వెర్షన్ మంచి ఆదరణ దక్కించుకుంది.

By:  Tupaki Desk   |   22 March 2024 1:53 PM GMT
OTTలో మిస్సైన సప్త సాగరాలు సైడ్ B.. రీజన్ ఏంటంటే..?
X

రక్షిత్ శెట్టి లీడ్ రోల్ లో హేమంత్ M రావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సప్త సాగరాలు దాటి. ప్రేమకథా చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా చెప్పొచ్చు అని ఈ సినిమాతో ప్రూవ్ చేశారు ఈ టీం. సప్త సాగరాలు దాటి సైడ్ A సెప్టెంబర్ లో రిలీజ్ కాగా సైడ్ B అక్టోబర్ లో రిలీజ్ లాక్ చేశారు. కన్నడలో హిట్టైన ఈ సినిమా తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. లవ్ స్టోరీస్ కి తెలుగులో ఎప్పుడు మంచి బజ్ ఉంటుంది. ఈ క్రమంలోనే సప్త సాగరాలు దాటి తెలుగు వెర్షన్ మంచి ఆదరణ దక్కించుకుంది.

సప్త సాగరాలు దాటి సైడ్ A సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ రిలీజ్ కాగా సైడ్ B కూడా ఈ మధ్యనే ఓటీటీలో రిలీజ్ చేశారు. ఐతే ఏమైందో ఏమో సప్త సాగరాలు దాటి సైడ్ B ని ప్రైమ్ వీడియో నుంచి తొలగించారు. సైడ్ B మొన్నటిదాకా కేవలం సౌత్ భాషల్లోనే అందుబాటులో ఉంది. నార్త్ ఆడియన్స్ అంతా హిందీ వెర్షన్ కోసం ఎదురు చూశారు. ఇప్పుడు సైడ్ B అసలు ఓటీటీలోనే లేకుండా పోయింది. దీని వెనుక రీజన్ ఏంటని ఆడియన్స్ షాక్ అవుతున్నారు.

సప్త సాగరాలు దాటి సైడ్ B సినిమా కేవలం కొంత కాలం మాత్రమే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా లైసెన్స్ తీసుకున్నారట. ఆ లైసెన్స్ పూర్తి కావడంతో సినిమా రిమూవ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే సప్త సాగరాలు సైడ్ B సినిమా రిలీజ్ టైం కు ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వలేదట. అయితే ఫస్ట్ పార్ట్ ప్రైమ్ వీడియోలో వచ్చే సరికి ఆడియన్స్ అందరు ఈగర్ గా ఉన్నారని కొన్ని రోజుల అగ్రిమెంట్ తో సైడ్ Bని ప్రైమ్ వీడియోలో ఉంచారు.

సప్త సాగరాలు దాటి శాటిలైట్ రైట్స్ ను జీ నెట్ వర్క్ సొంతం చేసుకుందని తెలుస్తుంది. ఓటీటీ వెర్షన్ కూడా జీ 5లో అందుబాటులో వస్తుందని చెబుతున్నారు. సప్త సాగరాలు సైడ్ B త్వరలో జీ 5 లో అవైలబుల్ లోకి వస్తుంది. రక్షిత్ శెట్టి సరసన రుక్మిణి వసంత్ నటించిన ఈ సినిమాలో చైత్ర కూడా మరో ఇంపార్టెంట్ రోల్ లో నటించింది. కన్నడలో కొత్త కొత్త ప్రయోగాలతో తన సత్తా చాటుతున్న రక్షిత్ శెట్టి సప్త సాగరాలు సైడ్ A, సైడ్ B సినిమాలతో తెలుగులో కూడా క్రేజ్ తెచ్చుకున్నాడు. అతను చేసే నెక్స్ట్ సినిమాలు తెలుగు రిలీజ్ చేసినా ఇక్కడ మంచి మార్కెట్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది.