Begin typing your search above and press return to search.

సప్తసాగరాలు సైడ్ B.. ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే..

రక్షిత్ శెట్టి కథానాయకుడు సప్తసాగారాలు దాటి సైడ్ A మొదటి భాగం కన్నడ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి క్రేజ్ అందుకుంది

By:  Tupaki Desk   |   9 Nov 2023 2:59 PM GMT
సప్తసాగరాలు సైడ్ B.. ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే..
X

రక్షిత్ శెట్టి కథానాయకుడు సప్తసాగారాలు దాటి సైడ్ A మొదటి భాగం కన్నడ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి క్రేజ్ అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా రెండో భాగాన్ని కూడా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సభ్యులు సిద్ధమయ్యారు. తెలుగులో ఈ సినిమాన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత వివేక్ గారు రిలీజ్ చేయబోతున్నారు.. ఇక ప్రమోషన్స్ లో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొన్న చిత్ర యూనిట్ సభ్యులు సినిమా విశేషాలను పంచుకున్నారు.

హీరో రక్షిత్ మాట్లాడుతూ.. తెలుగులో ఇప్పటికే నేను నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి అతడే శ్రీమన్నారాయణ.. చార్లీ 777. ఇక లేటెస్ట్ గా వచ్చిన సప్త సాగరాలు దాటి మంచి గుర్తింపును అందుకుంది. ఇప్పుడు రెండో భాగం కోసం తెలుగు వారి ముందుకి మరోసారి రావడం జరిగింది. ఈసారి డిఫరెంట్ కంటెంట్ తో మరింత కొంతగా సైడ్ B సినిమా ఉండబోతోంది.

తెలుగు ఆడియోన్స్ ఎప్పుడు కూడా మంచి కంటెంట్ తో వస్తే సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలాగే మీడియా కూడా ఎంతగానో సపోర్ట్ చేస్తూనే ఉంది. ఇక తెలుగులో మొదటి భాగం సినిమాను ఎంత ఘనంగా విడుదల చేసిన వివేక గారికి నా ధన్యవాదాలు. ఇక ఇప్పుడు సైడ్ B ని కూడా ఆయన గ్రాండ్ గా విడుదల చేయడం మరింత హ్యాపీగా ఉందని రక్షిత్ శెట్టి మాట్లాడారు.

ఇక సినిమా కథానాయక చైత్ర కూడా ఈ సినిమా సైడ్ A ఎలాంటి ఆదరణను అందుకుందో ఇప్పుడే సైడ్ బి కూడా అలాంటి ఆదరణ అందుకుంటుంది అనే నమ్మకం ఉందని ఆమె అన్నారు. ఇక సినిమా దర్శకుడు హేమంత్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో సప్తసాగరాలు దాటి.. మంచి గుర్తింపు అందుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగం చాలా విభిన్నంగా ఉండబోతోంది. సరికొత్త తరహాలో సినిమా ఎమోషన్ ను ఎంజాయ్ చేస్తారు. ఇక ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న పీపుల్స్ మీడియాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు.

నిర్మాత వివేక్ మాట్లాడుతూ సైడ్ ఏ వచ్చినప్పుడు ప్రమోషన్స్ కు అంత సమయం దొరకలేదు. కేవలం విడుదలకు 4 రోజులు ముందు పబ్లిసిటీ స్టార్ట్ చేశాము. అయినప్పటికీ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా ఏరియాలలో హౌస్ ఫుల్ బోర్డులు కూడా కనిపించాయి. ఇప్పుడు రెండో భాగం కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా విడుదల చేయబోతున్నాము. 17వ తేదీ వరకు టైమ్ ఉంది కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ స్థాయిలో ప్రమోషన్ చేయాలని అనుకుంటున్నాము. ఇక ఈ సినిమా మొదటి భాగం కంటే ఎక్కువ స్థాయిలో విజయం సాధిస్తుంది అని నమ్మకంతో ఉన్నట్లు వివేక్ తెలియజేశారు.