టీజర్ టాక్: సప్త సముద్రాలు దాటిన ప్రేమ
బ్యాక్ గ్రౌండ్ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. బలమైన ప్రేమ కథగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 16 Sep 2023 1:17 PM GMTరిక్షిత్ ..రుక్మిణి వసంత్ జంటగా హేమంత్ ఎం. రావు దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం 'సప్త సాగార దాచే' ఇటీవల విడుదలై కన్నడలో మంచి విజయం సాధించింది. అక్కడ క్లాసిక్ హిట్ అందుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తెలుగులోకి అనువదిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది.
టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఓ పాత టేప్ రికార్డులో మనుని తలుచుకుంటూ ప్రియ ప్రేమని రికార్డు చేస్తుంది. 'మను నా ఆశ ఏంటో తెలుసా? ఊళ్లో సముద్రం ఉంది కదా! ఆ సముద్రం ఒడ్డున నీతో జీవితాంతం నడుస్తూనే ఉండాలి. అలలు ఒక్కోక్కటిగా వచ్చి మన పాదాలు తడుపుతుంటే నేను నీచేతులు గట్టిగా పట్టుకోవాలి. ఆ అలల శబ్దాన్ని అలా వింటుంటేగట్టిగా పాడాలని పిస్తుంది మను.
నీకెప్పుడు చెప్పలేదు గానీ నీతో ఉన్నప్పుడు కూడా అలాగే అనినిస్తుంది. నా సముద్రం నువ్వు' అంటూ సాగే వాయిస్ ఓవర్ ఆకట్టుకుంటుంది. ఇద్దరి ప్రేమికుల గుండె చప్పుడిది. ఆ ప్రేమను దక్కించుకోవడం కోసం ప్రేమికులు ఎంత మనో వేదనకి గురయ్యారు? అన్నది టీజర్ లో హైలైట్ చేసారు. బ్యాక్ గ్రౌండ్ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. బలమైన ప్రేమ కథగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.
ఇందులో ఓ బిజినెస్‌మెన్ వద్ద కార్ డ్రైవర్‌గా పనిచేసే మను అనే యువకుడిగా రక్షిత్‌శెట్టి.. సింగర్ కావాలని కలలు కనే ప్రియ అనే అమ్మాయిగా రుక్మిణి వసంత్ కనిపించారు. బిజినెస్‌మెన్ కుమారు చేసిన ఓ తప్పిదం కారణంగా వాళ్లు ఎలా దూరమయ్యారు అనేది మెయిన్ థీమ్. సెప్టెంబర్ 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను మాతృకలో రెండు పార్ట్‌లుగా తెరకెక్కించారు. 'సప్త సాగర దాచే ఎల్లో సైడ్' ఏ పేరుతో పార్ట్ వన్‌ను రిలీజ్ చేశారు. సప్త సాగర దాచే ఎల్లో సైడ్ బీ టైటిల్‌తో సీక్వెల్ అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.