కమెడియన్ పక్కన హీరోయిన్‌గా నటించడమేంటి అన్నారు
కానీ సప్తగిరి లాంటి యాక్టర్లకు కూడా హీరోయిన్లను ఎంపిక చేయడం కష్టంగానే మారిందని ఆయన చెప్పిన మాటల్ని బట్టి చూస్తుంటే అర్థమవుతోంది.
By: Tupaki Desk | 17 March 2025 9:50 AM ISTహీరోయిన్లకే కాదు, హీరోలకు కూడా ఎన్నో ఇబ్బందులుంటాయి. తన పక్క నటించడానికి చాలా మంది హీరోయిన్లు నో చెప్పారంటున్నాడు కమెడియన్ కం హీరో టర్డ్న్ యాక్టర్ సప్తగిరి. ఈ మధ్య స్టార్ హీరోలకే హీరోయిన్లను సెట్ చేయడం కష్టమవుతుంది అనుకుంటున్నారు. కానీ సప్తగిరి లాంటి యాక్టర్లకు కూడా హీరోయిన్లను ఎంపిక చేయడం కష్టంగానే మారిందని ఆయన చెప్పిన మాటల్ని బట్టి చూస్తుంటే అర్థమవుతోంది.
టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ వారిలో చాలా తక్కువ మందికే గుర్తింపు ఉంది. అందుకే స్టార్ హీరోల సినిమాలకు పక్క భాషల నుంచి హీరోయిన్లను తెచ్చుకుంటున్నారు. పోనీ చిన్న హీరోలకైనా మన దగ్గరున్న హీరోయిన్లు ఉన్నారు కదా అనుకుంటే వారు ఏ సినిమా పడితే ఆ సినిమా చేయడం లేదు.
అలాంటిది ఇండస్ట్రీలోకి ముందుగా కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత పలు సినిమాల్లో హీరోగా నటించిన సప్తగిరి పక్కన హీరోయిన్ గా చేయమంటే ఎవరూ ముందుకు రాలేదట. మగజాతి ఆణిముత్యం అంటూ తెలుగులో మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్న సప్తగిరి హీరోగా నటించిన పెళ్లి కాని ప్రసాద్ సినిమా మార్చి 21న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
ఈ సినిమాలో సప్తగిరి పక్కన హీరోయిన్ పాత్ర కోసం పేరున్న హీరోయిన్‌ను నటింపచేయాలని చిత్ర దర్శకనిర్మాతలు ఎంతో ట్రై చేశారట. కానీ ఫలితం లేకపోయింది. తన పక్కన నటించడానికి చాలా మంది హీరోయిన్లు ఒప్పుకోలేదని, కమెడియన్ పక్కన హీరోయిన్ గా చేయడమేంటి అన్నారని, నో చెప్పిన వాళ్ల లిస్ట్ చాలా పెద్దదే అని సప్తగిరి చెప్పాడు. చివరకు తమ అదృష్టం కొద్దీ ప్రియాంక ఒప్పుకుందని ఆయన తెలిపాడు.
అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. పెళ్లి కాని ప్రసాద్ సినిమా నుంచి ఆల్రెడీ రిలీజైన టీజర్, ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ రిలీజయ్యాక సినిమాకు హైప్ పెరిగింది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ద్వారా దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు.