ఐపీఎస్ అవ్వాల్సిన దాన్ని హీరోయిన్ అయ్యా!
'కాంతార' తో వెలుగులోకి వచ్చిన సప్తమీగౌడ గురించి పరిచయం అవసరం లేదు. రెండవ సినిమాతోనే పాన్ ఇండియాలో ఫేమస్ అయింది
By: Tupaki Desk | 24 April 2024 12:30 AM GMT'కాంతార' తో వెలుగులోకి వచ్చిన సప్తమీగౌడ గురించి పరిచయం అవసరం లేదు. రెండవ సినిమాతోనే పాన్ ఇండియాలో ఫేమస్ అయింది. అటుపై యువ..కాళీ.. ది వాక్సిన్ వార్ లాంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం 'కాంతార' ప్రీక్వెల్ లో నటిస్తోంది. అలాగే నితిన్ సరసన 'తమ్ముడు' సినిమాలో ఛాన్స్ అందుకుంది. తాజాగా యూపీఎస్సీ ఫలితాలు రిలీజ్ అయిన నేపథ్యంలో తాను కూడా ఐపీఎస్ కాబోయి నటిని అయ్యానన్న సంగతి గుర్తు చేసుకుంది.
సివిల్ ఇంజనీరింగ్ అనంతరం యూపీఎస్సీ రాసి ఐపీఎస్ అవ్వాలనుకుందిట. పోలీస్ డిపార్ట్ మెంట్ అంటే చిన్న నాటి నుంచి ఆసక్తి అట. తండ్రి పోలీస్ ఆఫీసర్ కావడంతో అతని స్పూర్తితోనే ఆ రంగంలోకి వెళ్లాలనుకుందిట. చదువులో చురుకుతనం చూసి ఇంట్లో వాళ్లు కూడా తప్పకుండా సివిల్స్ కి సెలక్ట్ అవుతుందని భావించారుట. స్పోర్ట్స్ లో కూడా యాక్టివ్ గా ఉండేదట. కానీ సినిమాల్లోకి వచ్చి హీరోయిన్ అయ్యానంటోంది. 'సివిల్స్ వైపు వెళ్తే కచ్చితంగా సక్సెస్ అయ్యే దాన్ని. కానీ ఇప్పుడా ఛాన్స్ లేదు. చాలా కాన్సంట్రేషన్ తో చదవాలి.
ఇప్పుడంత శ్రద్ద గా చదవలేను. అనుకోకుండా నటిని అయ్యాను కాబట్టి ఇకపై ఈ రంగంలోనే రాణిస్తానని' తెలిపింది. ఏ పనైనా పట్టుదలతో చేస్తే అది సాధ్యమేనంటోంది. ఈ బ్యూటీ చిన్న నాటి నుంచి ట్యాలెంటెడ్. ఐదేళ్ల వయసులోనే కఠినమైన ఈత నేర్చుకుంది. ఆ విద్యతో రాష్ట్ర జాతీయ స్థాయిలో అవార్డులు...రివార్డులు దక్కించుకుంది. రజత..కాంస్య..బంగారు పతకాలు సైతం అందుకుంది. నటిగా 2020 లో ప్రారంభమైంది.
తొలి సినిమాతోనే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డు అందుకుంది. పాప్ కార్న్ మంకీ టైగర్ ఆమె నటించిన తొలి కన్నడ సినిమా. ఆ సినిమా చేసిన వెంటనే మరో ఛాన్స్ కోసం రెండేళ్లు వెయిట్ చేసింది. అప్పుడే రిషబ్ శెట్టి 'కాంతార'లో ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా పాన్ ఇండియాలో సంచలన విజయం సాధించడంతో సప్తమి నెట్టింట పాపులర్ అయింది.