Begin typing your search above and press return to search.

కాంతార హీరోయిన్ కు కోర్టులో ఊరట.. ఏం జరిగిందంటే?

కాంతార సినిమా కన్నడ, తెలుగు అలా అన్ని భాషల్లో సూపర్ హిట్ కావడంతో ఇండస్ట్రీలో సప్తమి గౌడ పేరు మారుమోగింది.

By:  Tupaki Desk   |   17 Jun 2024 9:38 AM GMT
కాంతార హీరోయిన్ కు కోర్టులో ఊరట.. ఏం జరిగిందంటే?
X

కాంతార మూవీతో ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ సప్తమి గౌడ. ఆ సినిమాలో డీ గ్లామర్ రోల్ లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. శారీలో, పోలీస్ గార్డ్ గెటప్ లో పల్లెటూరి పిల్లలా ఫిదా చేసింది. కాంతార సినిమా కన్నడ, తెలుగు అలా అన్ని భాషల్లో సూపర్ హిట్ కావడంతో ఇండస్ట్రీలో సప్తమి గౌడ పేరు మారుమోగింది. తన కెరీర్ లో రెండో సినిమాతోనే మంచి క్రేజ్ దక్కించుకుంది.

కాంతార తర్వాత వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన వ్యాక్సిన్ వార్ లో యాక్ట్ చేసింది. ఆ సినిమాతో కూడా హిట్ అందుకుంది. ఇప్పుడు సప్తమి టాలీవుడ్ లో ఫస్ట్ స్ట్రయిట్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. యంగ్ హీరో నితిన్ తమ్ముడు సినిమాలో యాక్ట్ చేస్తోంది. యాక్టింగ్ కు గట్టిగా మంచి స్కోప్ ఉన్న రోల్ లో ఆమె కనిపించనున్నట్లు ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

తాజాగా సప్తమి గౌడ వార్తల్లో నిలిచింది. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ఫ్యామిలీకి చెందిన మరో హీరో యువరాజ్ కుమార్ భార్య శ్రీదేవి భైరప్ప.. సప్తమిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. రీసెంట్ గా యువరాజ్ కుమార్, శ్రీదేవి విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ సమయంలో తన భర్త.. సప్తమి గౌడతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది. ఆమె చాలా అమాయకంగా కనిపిస్తుందని, కానీ నిజానికి ఆమె క్యారెక్టర్ వేరని ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది.

దీంతో శ్రీదేవి ఆరోపణలపై సప్తమి గౌడ స్పందించింది. తనపై శ్రీదేవి తప్పుడు ఆరోపణలు చేస్తుందంటూ బెంగళూరు కోర్టును ఆశ్రయించింది. శ్రీదేవి భైరప్పపై కోర్టులో కేసు వేసింది. పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేసినందుకు చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో కోర్టు సప్తమి పిటిషన్ పై విచారణ చేపట్టింది. శ్రీదేవి భైరప్పకు నోటీసులు జారీ చేసింది. అలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయవద్దని ఆదేశించింది.

కోర్టు తీర్పుతో సప్తమి గౌడకు ఇప్పుడు ఊరట లభించినట్లు అయింది. అయితే పాప్ కార్న్ మంకీ టైగర్ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ. ఆ తర్వాత కాంతారలో ఛాన్స్ దక్కించుకుని ఫేమస్ అయింది. స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పుడు టాలీవుడ్ లో తమ్ముడు మూవీతో పాటు శాండల్ వుడ్ లో అనేక సినిమాల్లో యాక్ట్ చేస్తోంది. మరి కొత్త సినిమాలతో ఈ బ్యూటీ ఎలాంటి హిట్లు కొడుతుందో చూడాలి