Begin typing your search above and press return to search.

థియేటర్ రిలీజ్ అయిన వారంలోనే ఓటీటీలోకి..!

ఈ మధ్య కాలంలో కన్నడ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయాలను సొంతం చేసుకుంటున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   29 Sep 2023 9:28 AM GMT
థియేటర్ రిలీజ్ అయిన వారంలోనే ఓటీటీలోకి..!
X

ఈ మధ్య కాలంలో కన్నడ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయాలను సొంతం చేసుకుంటున్న విషయం తెల్సిందే. కన్నడ హీరో రక్షిత్ శెట్టి శ్రీమన్నారాయణ, 777 చార్లి సినిమాలతో తెలుగు లో కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. తాజాగా సప్తసాగరాలు దాటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

కన్నడంలో మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో వెంటనే తెలుగు లో డబ్‌ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. సెప్టెంబర్‌ 22న తెలుగు ప్రేక్షకుల ముందుకు థియేటర్ల ద్వారా వచ్చిన సప్తసాగరాలు దాటి : సైడ్ ఏ అంటూ వచ్చిన ఈ సినిమా ను అప్పుడే ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్‌ చేస్తున్నారు.

తెలుగు లో విడుదల అయి వారం రోజులు కూడా కాకుండానే అప్పుడే ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కొన్ని చోట్ల ఈ సినిమా థియేట్రికల్‌ రన్‌ అవుతూనే ఉంది. అయినా కూడా అమెజాన్ ప్రైమ్ ద్వారా సినిమాను స్ట్రీమింగ్ చేయడం తో థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి.

టాలీవుడ్ ప్రేక్షకులు థియేటర్ల ద్వారా ఈ సినిమాను ఇంకా చూస్తూ ఉండగానే అప్పుడే ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ చేయడం ను కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్నడ వర్షన్ మాత్రమే కాకుండా తెలుగు వర్షన్ కూడా ఓటీటీ ద్వారా అందుబాటులో ఉండటంతో థియేటర్‌ రన్‌ క్లోజ్ అయినట్లే. కనీసం ఇంకో వారం అయినా ఓటీటీ స్ట్రీమింగ్‌ ఆగాల్సింది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.