ఆ హీరో కుమార్తె నాల్గవసారి లవ్ లో పడిందా!
సైఫ్ అలీఖాన్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన సారా అలీఖాన్ కెరీర్ గురించి చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 1 Nov 2024 5:55 AM GMTసైఫ్ అలీఖాన్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన సారా అలీఖాన్ కెరీర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అవకాశాల పరంగా ఎలాంటి ఢోకాలేదు. ట్యాలెంటెడ్ నటిగా ఛాన్సులు బాగానే అందుకుంటుంది. సైఫ్ అలీఖాన్ ఇమేజ్ తోనూ కొంతవరకూ ఛాన్సులు ఒడిసిపట్టుకోగల్గుతుంది. ఇలా కెరీర్ పరంగా ఇబ్బందేం లేదు. కానీ అమ్మడు ఎఫైర్ల విషయంలోనే నిత్యం నానుతుంటుంది. ఇప్పటికే సొగసరి ముగ్గురుకి బ్రేకప్ చెప్పింది.
తొలుత సుషాంత్ సింగ్ రాజ్ పుత్ రొమాంటిక్ స్టోరీలు నడిపినట్లు అప్పట్లో వెలుగులోకి వచ్చాయి. సుషాంత్ మరణం నేపథ్యంలో ఈడీ కేసు సైతం ఎదుర్కుంది. అటుపై యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ తోనూ కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసి నట్లు ప్రచారంలో ఉంది. ఇద్దర్నీ ఓ సినిమా పరిచయం చేయడంతో ఆ పరిచయం ప్రేమగా మారి రిలేషన్ షిప్ వరకూ దారి తీసిందని అప్పట్లో బాలీవుడ మీడియా కోడై కూసింది.
అది ముగిసన అనంతరం అసిస్టెంట్ డైరెక్టర్ తో జెహాన్ హండాతోనూ చాలా కాలం పాటు రిలేషన్ షిప్ ని కొనసా గించినట్లు వార్తలొచ్చాయి. ఇలా ఆరేళ్ల కెరీర్ లోనే ముగ్గురు ప్రియుళ్లను మార్చింది. తాజాగా అమ్మడు సూపర్ మోడల్ అర్జున్ ప్రతాప్ బజ్వాతో ప్రేమ పాఠాల్లో బిజీగా ఉందనే ప్రచారం ఊపందుకుంది. ఇద్దరు క్లోజ్ గా మూవ్ అవుతున్నట్లు మీడియాలో పెద్ద దుమారే రేగుతోంది. ఇటీవల ఇద్దరూ కలిసి అనేక పర్యటనలు చేసినట్లు వార్తలొస్తున్నాయి.
అయితే దీనిపై ఇంకా సారా గానీ, అర్జున్ గానీ స్పందించలేదు. అర్జున్ ఇంకా మోడలింగ్ లోనే ఉన్నాడు. నటుడిగా ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు. అతడు కేవలం మోడల్ మాత్రమే కాదు. మంచి జిమ్నాస్టిక్స్, మిక్స్డ్ మార్షల్ ఆర్స్ట్ ఫైటర్ కూడా. అంతే కాదు అతడికి బలమైన పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంది. పంజాబ్‌కు చెందిన ఒక కాంగ్రెస్ నాయకుడి కుమారుడని సమాచారం. పంజాబ్ జిల్లా కౌన్సిల్లో యువ కాంగ్రెస్ నాయకులలో ఒకరిగా అర్జున్ కి గుర్తింపు ఉంది. గతంలో ప్రభుదేవా డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనూ పనిచేసాడుట.