Begin typing your search above and press return to search.

ఒక్క క్ష‌ణం మ‌తి పోగొట్టిన న‌ట‌వార‌సురాలు

నిరంత‌రం సామాజిక మాధ్య‌మాల్లో సారా అలీఖాన్ ఫోటోషూట్లు వైర‌ల్ అవుతూనే ఉన్నాయి.

By:  Tupaki Desk   |   29 Sep 2024 12:00 AM GMT
ఒక్క క్ష‌ణం మ‌తి పోగొట్టిన న‌ట‌వార‌సురాలు
X

సారా అలీఖాన్ - అందం.. ప్ర‌తిభ.. అణ‌కువ‌.. ఇలా ఏ కోణంలో చూసినా ది బెస్ట్ ఇన్ బాలీవుడ్. మామ్ అమృత‌ను పోలి ఉండే సారా, పాపా సైఫ్ స‌ల‌హాతో చిత్ర‌సీమ‌లో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ డ‌మ్ అందుకునే దిశగా సాగుతోంది. ఇప్ప‌టికే తాను న‌టించిన సినిమాల‌తో న‌టిగా పేరు తెచ్చుకుంది. మ‌రోవైపు ఫ్యాష‌న్ అండ్ ట్రెండ్స్ లోను ట్రెండ్ సెట్ట‌ర్ గా మారుతోంది. నిరంత‌రం సామాజిక మాధ్య‌మాల్లో సారా అలీఖాన్ ఫోటోషూట్లు వైర‌ల్ అవుతూనే ఉన్నాయి.


తాజాగా అద్భుతమైన అబుజానీ సందీప్ కోస్లా డిజైన‌ర్ గౌనులో సారా క‌నిపించింది. గోల్డెన్ గౌను కాంబినేష‌న్ యాక్సెసరీస్‌లో రెట్రో గ్లామర్‌ను వెదజల్లుతూ క‌నిపించింది సారా. వెండి ఒత్తులతో మిరుమిట్లు గొలిపేలా అందంగా అలంకరించిన ఆకర్షణీయమైన గోల్డెన్ గౌనులో అద్భుతమైన రూపంతో సారా అభిమానులను థ్రిల్ చేసింది. సారా ధ‌గ‌ధ‌గా మెరిసే వెండి డిజైన్ల‌తో అలంకరించిన స్లీవ్‌లెస్ గోల్డెన్ గౌనులో ఓపెన్ హిప్ ..థై స్లిట్ లుక్ తో గుబులు రేపింది. బాహ్య అంతరిక్షంలో నాట్ అవుట్ ఆఫ్ ప్లేస్ అని దీనికి క్యాప్ష‌న్ ఇచ్చింది. సారా ఈ కొత్త లుక్ లో హెడ్ ట‌ర్న‌ర్ గా నిలిచింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 45.8 మిలియన్ల మంది అనుచరులకు ఇది స్పెష‌ల్ ట్రీట్ గా మారింది.


సైఫ్ అలీ ఖాన్ - అమృతా సింగ్ ల‌ కుమార్తె సారా అలీఖాన్. కానీ ఆమె తల్లిదండ్రులు 2004లో విడిపోయారు. త‌న‌కు ఇబ్రహీం అనే త‌మ్ముడు ఉన్నాడు. సారా 2018లో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో కలిసి అభిషేక్ కపూర్ రొమాంటిక్ ఇంటర్-ఫెయిత్ లవ్ స్టోరీ `కేదార్‌నాథ్`లో నటించింది. ఆ తర్వాత రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం `సింబా`లో నటించింది. రోహిత్ శెట్టి పిక్చర్స్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ధర్మ ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మించాయి. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్, సోనూ సూద్ కీల‌క పాత్ర‌లు పోషించ‌గా, అజయ్ దేవగణ్ తన `సింగం` పాత్రతో అతిధిగా క‌నిపిస్తాడు. లవ్ ఆజ్ కల్, కూలీ నంబర్ 1, అత్రంగి రే, గ్యాస్‌లైట్, జరా హాట్కే జరా బచ్కే, మర్డర్ ముబారక్ వంటి సినిమాల్లో కూడా భాగమైంది.


1942లో భారతదేశ స్వాతంత్య్ర‌ పోరాటం చుట్టూ తిరిగే చారిత్రాత్మక జీవితచరిత్ర చిత్రం `ఏ వతన్ మేరే వతన్`లో సారా చివరిసారిగా ఉషా మెహతాగా కనిపించింది. దీనిని కన్నన్ అయ్యర్ రచించి దర్శకత్వం వహించారు. కరణ్ జోహార్ నిర్మించారు, ఇందులో ఇమ్రాన్ హ‌ష్మి, అలెక్స్ ఓ నెల్ కూడా నటించారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది. సారా న‌టించిన `మెట్రో... ఇన్ డినో`, `స్కై ఫోర్స్`, `ఈగిల్` విడుద‌ల‌కు రావాల్సి ఉంది.