Begin typing your search above and press return to search.

సారా అలీఖాన్ వ్య‌క్తిత్వానికి సెల్యూట్!

వృత్తిగ‌త జీవితాన్ని ప‌క్క‌న‌బెట్టి వ్య‌క్తిగ‌త జీవితంలోకి వెళ్తే సారా లో రేర్ క్వాలిటీస్ కొన్ని ఉన్నాయి.

By:  Tupaki Desk   |   9 Jan 2025 7:32 AM GMT
సారా అలీఖాన్ వ్య‌క్తిత్వానికి సెల్యూట్!
X

స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ వార‌సురాలిగా సారా అలీఖాన్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్రోఫెష‌న‌ల్ గా అమ్మడి కెరీర్ దేదీప్య మానంగా సాగిపోతుంది. యంగ్ హీరోల‌కు ప‌ర్పెక్ట్ జోడీగా అవ‌కాశాలు అందుకుంటుంది. న‌టిగా అమ్మ‌డు ప్రూవ్ చేసుకుంది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. వృత్తిగ‌త జీవితాన్ని ప‌క్క‌న‌బెట్టి వ్య‌క్తిగ‌త జీవితంలోకి వెళ్తే సారా లో రేర్ క్వాలిటీస్ కొన్ని ఉన్నాయి.

అమ్మ‌డికి కులం, మ‌తం, ప్రాంతం, బేధం లేదంటూ ఎన్నోసార్లు ప్రూవ్ చేసింది. దేశంలో అన్ని ప‌విత్ర స్థ‌లాల‌ను సంద‌ర్శిస్తుంది. అన్ని మ‌తాల దేవుళ్ల‌ను స‌మానంగా కొలుస్తుంది. ఇత‌రుల దృష్టిలో తాను సిక్కు-ముస్లీమ్ అయినా ? సారా మాత్రం అన్ని మ‌తాలు త‌న‌వే అంటుంది. ప్ర‌తీ ఏడాది కేదార్ నాధ్ యాత్ర‌కు త‌ప్ప‌క వెళ్తుంది. ఆ ప్ర‌యాణం ఎంతో ప్ర‌మాద‌క‌ర‌మైనా, క‌ఠినంగా ఉన్నా? కేద‌ర్ నాధ్ యాత్ర మాత్రం మిస్ కాదు.

త‌న‌తో పాటు స్నేహితుల్ని కూడా తీసుకెళ్తుంటుంది. తాజాగా కొత్త ఏడాది తొలి సోమ‌వారం కర్నూల్ లోని శ్రీశైలం మల్లి ఖార్జునుడి ఆల‌యం వద్ద గడిపింది. దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. సారా తెలుపు రంగు దుస్తుల్లో క‌నిపించింది. దీంతో సారా అలీఖాన్ పేరు మ‌రోసారి నెట్టింట సంచ‌ల‌నంగా మారింది. సారాలో భ‌క్తి భావం చూసి నెటి జ‌నులు ఆస‌క్తిక‌ర పోస్టులు పెడుతున్నారు.

సారా వ్య‌క్తిగ‌త జీవితంలో నేటి జ‌న‌రేష‌న్ యువ‌తికి ఆద‌ర్శంగా నిలుస్తుందంటున్నారు. కులం, మ‌తం, ప్రాంతం అంటూ ఊగిపోయే వారంతా సారా వ్య‌క్తిగ‌త జీవితాన్ని ఆద‌ర్శంగా తీసుకోవాలంటున్నారు. ఆమె వ్య‌క్తిత్వానికి సెల్యూట్ అంటూ ఓ నెటి జ‌నుడు రాసుకొచ్చాడు. సారా అలీఖాన్ ప్ర‌స్తుతం బాలీవుడ్ సినిమాల‌తో బిజీగా ఉంది. ఇప్ప‌టికే `స్కై ఫోర్స్` ,` మెట్రో` చిత్రాల షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం అవి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉన్నాయి. మ‌రో చిత్రం ఆన్ సెట్స్ లో ఉంది.