Begin typing your search above and press return to search.

బ్రాండ్ల‌తో సారా టెండూల్క‌ర్ ఆదాయం షాకిస్తోందే

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

By:  Tupaki Desk   |   11 Oct 2024 4:30 PM GMT
బ్రాండ్ల‌తో సారా టెండూల్క‌ర్ ఆదాయం షాకిస్తోందే
X

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత సారా యూనివర్సిటీ కాలేజ్ లండన్ నుండి మాస్టర్స్ డిగ్రీని పొందింది. కేవలం 26 సంవత్సరాల వయస్సులో ఎంట‌ర్ ప్రెన్యూర్ గా ఇప్పటికే మిలియన్ల డాల‌ర్ల‌ విలువైన వ్యాపారానికి యజమానిగా ఎదిగింది. సారా తన ఫ్యాషన్ సెన్స్ తో నిరంత‌రం వెలుగులు ప్ర‌స‌రిస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. నిరంత‌రం సారా ఫోటోషూట్లు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఆమెకు లక్షలాది మంది ఫాలోవర్లు ఈ బ్యూటీకి ఉన్నారు.


భారత క్రికెట్ జట్టుకు మద్దతుగా స్టేడియంలో సారా తరచుగా కనిపిస్తుంటుంది. ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 6.6 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇది త‌న‌కు ఉన్న ఫాలోయింగ్ ని తెలియ‌జేస్తుంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె అయినా కానీ త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక‌మైన‌ గుర్తింపును తెచ్చుకుంది. సారా తన వ్యక్తిగత వ్యాపారాల్లో రాణిస్తూ బాగానే ఆర్జిస్తోంది. లెజెండ‌రీ క్రికెట్ అండ‌దండ‌లు ఉన్నప్పటికీ సారా తన సొంత గుర్తింపును నిర్మించుకుంది. మీడియా క‌థ‌నాల ప్రకారం.. 2023లో సారా టెండూల్కర్ నికర ఆస్తి విలువ రూ. 50 లక్షల నుండి రూ. 1 కోటి వరకు ఉండేద‌ని అంచనా. 26 సంవత్సరాల వయస్సులో ఈ భామ‌ ఇప్పటికే ఆన్‌లైన్ వ్యాపారాన్ని స్థాపించింది. సారా టెండూల్కర్ `షాప్` అనే ఆన్‌లైన్ స్టోర్‌ను నడుపుతోంది. అదనంగా ఈ సంవత్సరం కొరియన్ బ్యూటీ బ్రాండ్ లానీజ్‌కి ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితురాలైంది. దాని నుండి భారీ ఆదాయాన్ని ఆర్జిస్తోంది.


ఆమె విద్యావిషయక విజయాలతో పాటు.. సారా మోడల్‌గా ఫ్యాషన్ ప్రపంచంలోకి కూడా ప్రవేశించింది. ఆమె తన మోడలింగ్ వృత్తిని 2021లో అజియో లక్స్‌తో ప్రారంభించింది. తన అద్భుతమైన అందాన్ని ప్రదర్శిస్తూ భారతదేశం స‌హా విదేశాలలోని ప‌లు ఫ్యాషన్ షోల రన్‌వేలను అలంకరించింది. సారా లండ‌న్ యూనివర్సిటీ కాలేజ్ నుండి క్లినికల్ అండ్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్‌లో ప్రత్యేకతలతో మాస్టర్స్ డిగ్రీని కూడా కలిగి ఉంది.

12 అక్టోబర్ 1997న జన్మించిన సారా టెండూల్కర్ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ - డాక్టర్ అంజలి టెండూల్కర్ ల‌ కుమార్తె. సారా తమ్ముడు అర్జున్ టెండూల్కర్ క్రికెట్‌లో కెరీర్‌ను కొనసాగించడం ద్వారా తండ్రి అడుగుజాడలను అనుసరించగా సారా పూర్తిగా వేరే మార్గాన్ని ఎంచుకుంది. ఆమె మెడిసిన్ చదవడంలో తన తల్లి అడుగుజాడలను అనుసరించింది. పోషకాహార నిపుణురాలిగా వృత్తిని కొనసాగించాలని సారా లక్ష్యంగా పెట్టుకుంది. కానీ మోడలింగ్ - ఫ్యాషన్ పై త‌న‌కున్న నిజమైన అభిరుచిని వెంటనే కనుగొంది. 2021లో ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది, ఈరోజు సారా న్యూట్రిషన్ కోచ్ మాత్రమే కాదు.. విజయవంతమైన మోడల్ కూడా.