బజార్ ఇండియాపై చురకత్తిలా పటౌడీ బ్యూటీ!
పాల నురుగుల సౌందర్యం పై బ్లాక్ అండ్ బ్లాక్ దుస్తుల్లో తళుక్కున మెరిసింది.
By: Tupaki Desk | 6 Nov 2024 5:30 PM GMTచురకత్తితో గుచ్చితో గుండెలోతుల్లోకి దిగాల్సిందే. చురకత్తి పదును అలాంటింది. మరి అందం అనే చురకత్తితో గుచ్చితే! ఆ గాయం పోటు ఇంకెంత లోతుగా వెళ్తుందో చెప్పాల్సిన పనిలేదు. తాజాగా పటౌడీ వారసురాలు సారా అలీఖాన్ అలాంటి పోటుకే కుర్రాకారుని గురి చేస్తుంది. ఇదిగో అమ్మడిలా బజార్ ఇండియా కవర్ పేజీపై చెల రేగింది. పాల నురుగుల సౌందర్యం పై బ్లాక్ అండ్ బ్లాక్ దుస్తుల్లో తళుక్కున మెరిసింది.
నలుపు రంగు ప్యాంట్ పై టాప్ లో మ్యాచింగ్ పీస్ దరించి క్లీవేజ్ బ్యూటీని హైలైట్ చేసింది. బ్యాక్ ను డిజైనర్ కోట్ తో కవర్ చేసింది. చేతిలో హ్యాండ్ బ్యాగ్ చైర్ పై కాలు చాపి స్టైలిష్ గా కెమెరాకి ఫోజులిచ్చింది. మరో పిక్ లో మోడ్రన్ బ్యూటీలో ఫోజులిచ్చింది. సారా హెయిర్ స్టైల్..మ్యాకప్ ఇతర అలంకరణ ప్రతీది మరింత అందంగా తీర్చిదిద్దాయి. సారా స్ట్రెయిట్ ఎటాకింగ్ కుర్ర కారు హృదయాలు ఛిద్రమవ్వడం ఖాయం.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక సారా అభిమానులు అమ్మడి అందాన్ని ఆకాశానికి ఎత్తకుండా ఉండలేకపోతున్నారు. లుక్స్ గార్జియస్...బ్యూటీఫుల్ లేడీ అంటూ తమదైన శైలిలో కామెంట్ల వర్షం గుప్పిస్తున్నారు. ఇక సారా కెరీర్ సంగతి చూస్తే బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. `గ్యాస్ లైట్`..`జర్ హట్ కే జర బచ్ కే`..`యే వతన్ మేరా వతన్` లాంటి విజయాలతో రెట్టింపు ఉత్సాహంలో ఉంది.
ప్రస్తుతం అమ్మడి ఖాతాలో హిందీలోనే ఐదారు సినిమాలు రెడీగా ఉన్నాయి. అవన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి. అవి గాక కొత్త ఛాన్సులు క్యూలో ఉన్నాయి. నటిగా డే బైడే షైన్ అవుతుంది. టాలీవుడ్ లో నూ లాంచ్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తోంది. సరైన ఛాన్స్ వస్తే దూకడానికి సిద్దంగానే ఉంది. ఇప్పటికే డాడ్ సైఫ్ అలీఖాన్ `దేవర`తో లాంచ్ అయిన సంగతి తెలిసిందే.