అండర్‌గ్రౌండ్ రేడియో ఉద్యమ నాయకురాలిగా
దేశం కోసం పోరాడిన యోధురాలిగా ఉషా మెహతా పాత్రలో సారా అలీ ఖాన్ పరివర్తన ఒక మాస్టర్ క్లాస్ జర్నీ అనడంలో సందేహం లేదు
By: Tupaki Desk | 23 March 2024 1:30 PM GMTపరిశ్రమలో రోజురోజుకు వెలుగులు విరజిమ్ముతున్న భామల్లో సారా అలీ ఖాన్ ఒకరు. ఈ బ్యూటీ మర్డర్ ముబారక్ లో అద్భుత పాత్రతో చాలా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత 'ఏ వతన్ మేరే వతన్' చిత్రంలో నటించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఈ చిత్రంలో దేశభక్తురాలు ఉషా మెహతా పాత్రను పోషించింది. ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రంలో సారా అలీ ఖాన్ స్వాతంత్య్ర సమరయోధురాలి పాత్రలో అద్భుత నటన, లోతైన హావభావాలతో మెరిపించింది. వరుసగా వైవిధ్యం ఉన్న పాత్రల్లో నటిగా తనలోని విలక్షణతను చాటుకుంది.
దేశం కోసం పోరాడిన యోధురాలిగా ఉషా మెహతా పాత్రలో సారా అలీ ఖాన్ పరివర్తన ఒక మాస్టర్ క్లాస్ జర్నీ అనడంలో సందేహం లేదు. నిజ జీవిత వ్యక్తి కథలో నటించడమే ఒ సాహసం అనుకుంటే, వందశాతం ప్రామాణికతతో సారా నటించి మెప్పించింది. స్వాతంత్రోద్యమ కాలంలో అండర్‌గ్రౌండ్ రేడియో ప్రసారాలకు నాయకత్వం వహించిన లేదా శాసనోల్లంఘన చర్యలలో పాల్గొన్న గట్సీ యువతిగా సారా అలీఖాన్ నటించింది. సారా ప్రతి సన్నివేశంలో అభిరుచితో.. దృఢ సంకల్పంతో నటించి అద్భుతంగా పండించింది. స్వాతంత్య్రానికి పూర్వం సమయంలో స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాట అనుభూతిని ప్రేక్షకులకు అందించిన ఈ చిత్రంలో సారా పాత్ర ప్రత్యేకతను ఆపాదించింది. ప్రజలు గుర్తించని గొప్ప దేశభక్తురాలి పాత్రలో నటించడానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యం సారాకు ఉంది. ఏ వతన్ మేరే వతన్ చిత్రంలో రెండు తరాల అంతరాన్ని తగ్గించే ప్రత్యేకమైన మేకోవర్ తో కనిపించి ఆకట్టుకుంది సారా.
'మర్డర్ ముబారక్'లో సారా బాంబి అనే అధునాతన సిటీ అమ్మాయి పాత్రలో నటించి మెప్పించింది. నిజానికి సారా తనను తాను ఆ పాత్ర కోసం మౌల్డ్ చేసుకున్న తీరు ఆకట్టుకుంది. బాంబి పాత్రలో స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు డైలాగ్ డెలివరీతోను మైమరిపించింది. ప్రేక్షకుల మనస్సులలో ఘాడంగా హత్తుకుపోయిన పాత్ర ఇది.. ఇప్పుడు 'ఏ వతన్ మేరే వతన్' చిత్రంలో దేశభక్తురాలి త్యాగం, ధైర్యం ప్రదర్శిస్తూ నటించడం ఆసక్తిని కలిగించింది. సారా స్థాయిని పెంచిన పాత్ర ఇది. ఉషా మెహతా పాత్రను పోషించడం నటిగా సారా అంకితభావానికి నిదర్శనం. ప్రజలు మరచిపోయిన ఒక రియల్ హీరో పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన సారా అలీఖాన్ అద్భుత నటప్రతిభతో మైమరిపించింది.