Begin typing your search above and press return to search.

స్వాతంత్య్ర‌ సమరయోధురాలిగా సారా అలీఖాన్

కుడిచేతికి నల్లటి గడియారం .. నుదిటిపై చిన్న‌పాటి బొట్టు.. జుట్టును అల్లిన విధానం ఎంతో ప్ర‌త్యేకంగా క‌నిపించాయి

By:  Tupaki Desk   |   22 Nov 2023 4:23 AM GMT
స్వాతంత్య్ర‌ సమరయోధురాలిగా సారా అలీఖాన్
X

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఖాన్ న‌టవార‌సురాలు సారా అలీ ఖాన్ కెరీర్ గ్రోత్ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ బ్యూటీ ఓవైపు గ్లామ‌రస్ పాత్ర‌ల్లో న‌టిస్తూనే న‌ట‌న ప‌రంగా నిరూపించుకునే పాత్ర ల‌కు ప్రాధాన్య‌త‌నిస్తోంది. ఇప్పుడు `ఏ వతన్ మేరే వతన్`లో స్వాతంత్య్ర‌ సమరయోధురాలిగా న‌టిస్తోంది. ఈ సినిమా నుంచి సారా పాత్ర లుక్‌ ని చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. ద‌ర్శ‌క‌నిర్మాత కరణ్ జోహార్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మోష‌న్ పోస్ట‌ర్ ని పోస్ట్ చేసారు, ఇందులో సారా అలీ ఖాన్ పాత్ర ఫోటోతో పాటు, `ఆజాద్ ఆవాజీన్, ఖైద్ నహీ హోతీ` అనే ప్రభావవంతమైన కోట్ క‌నిపించింది.

మోషన్ పోస్టర్ లో సారా పాత్రను ఉషా మెహతాగా పరిచయం చేసారు. తెల్లటి కాటన్ చీరలో నలుపు అంచు చీర‌లో క‌నిపించింది. కుడిచేతికి నల్లటి గడియారం .. నుదిటిపై చిన్న‌పాటి బొట్టు.. జుట్టును అల్లిన విధానం ఎంతో ప్ర‌త్యేకంగా క‌నిపించాయి. ఎంపిక చేసుకున్న పాత్ర కోసం సారా మేకోవ‌ర్ ఆక‌ట్టుకుంది. ఈ పోస్ట‌ర్ డైలాగ్ ని బ‌ట్టి సారా ధైర్య‌శాలి అయిన స‌మ‌ర‌యోధురాలిగా క‌నిపించ‌నుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

కరణ్ జోహార్ ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ గా విడుద‌ల కానుంది. స్వేచ్ఛ స్వాతంత్య్రాల కోసం ఉద్య‌మంలో ఒక మ‌హిళా ధైర్య‌శాలి గొప్ప‌త‌నాన్ని ఆవిష్క‌రిస్తుంది. న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌తో సారా అభిమానుల‌కు మ‌రింత చేరువ కానుంది.