అమ్మ గురించి అద్భుతంగా..మరి? నాన్న!
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ వారసురాలిగా సారా అలీఖాన్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సంగతి తెలిసిం దే.
By: Tupaki Desk | 18 March 2024 6:09 AM GMTబాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ వారసురాలిగా సారా అలీఖాన్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సంగతి తెలిసిం దే. వరుస విసయాలు అమ్మడికి ఎనలేని గుర్తింపును తీసుకొస్తున్నాయి. పటౌడీ వారసురాలు అంటే ఎలా ఉంటుందో చూపిస్తుంది. వెండి తెరపై ఎంత యాక్టివ్ గా ఉంటుందో? రియల్ లైఫ్ లో అంతకంతకు డౌన్ టూ ఎర్త్ ఉంటుంది. నిరాడంబర జీవితాన్ని ఇష్టపడుతుంది. గొప్ప శివ భక్తురాలు కూడా. అయితే అన్నీ ఉన్నా? అమ్మ-నాన్న కలిసి లేరన బెంగ మాత్రం ఇప్పటికీ అలాగే కనిపిస్తుంది.
సారీ అలీఖాన్ సైఫ్ అలీఖాన్ మొదటి భార్య అమృతా సింగ్ కుమార్తె. కాపురంలో కలతలు చోటు చేసుకో వడంతో సైఫ్ అలీఖాన్ విడిపోయి రెండవ పెళ్లీ కరీనాకపూర్ ని చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఇవన్నీ సహజంగా కనిపించేవే. కానీ తల్లిదండ్రులు వేరైతే ఆ బాధ ఎలా ఉంటుందో భరించే వాళ్లకే తెలుస్తుంది. తాజాగా సారా అలీఖాన్ కి మామ్ అంటే ఎంత ఇష్టమో చెప్పే ప్రయత్నం చేసింది. జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కున్నాను.
`అయినా ఈరోజు ఇంత ధైర్యంగా ఉన్నాను అంటే కారణం మా అమ్మ ఇచ్చిన ధైర్యమే. ఒంటరి తల్లికి జీవితంలో చాలా ఇబ్బందులుంటాయి. వాటన్నింటిని అధిగమించి నన్ను పెంచిన తీరును ఎప్పటికీ మర్చిపోలేను. అమ్మ పెంపకంలో నేను ఎంతో స్వతంత్రంగా పెరిగాను. ప్రతీసారి మనం అనుకున్నదే కచ్చితంగా జరగాలని లేదు. అలాంటప్పుడు కోపం చిరాకు..ఇదేం జీవితం అనిపిస్తుంటాయి. కానీ మనం చూసే కోణంలోనే సమస్యకు పరిష్కారం ఉంటుంది.
ఇలాంటి పరిస్థితుల్ని అర్దం చేసుకునే శక్తి సామార్ధ్యాలు నాకు అమ్మ నేర్పించింది. అందుకే మా అమ్మ ధైరం అంటూ అమ్మ గురించి ఎంతో అద్భుతంగా చెప్పుకొచ్చింది. అయితే డాడీ సైఫ్ అలీఖాన్ గురించి మాత్రం అమ్మడు ఎక్కడా స్పందించలేదు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తండ్రి గురించి మాట్లాడకపోవడంతో సైఫ్ అంటే అంతగా గిట్టదా? అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి. అయితే సైఫ్ అలీఖాన్ తో సారా చాలా సందర్భాల్లో కనిపించింది. ఆ ఇద్దరు కూడా మంచి డాడీ అండ్ డాటర్ గా కనిపిస్తుంటారు.